Begin typing your search above and press return to search.

100వ సినిమా.. నాగ్ ఎంట్రీకి వింటేజ్ టచ్

ఇక్కడ కారు లుక్ కూడా కాస్త వేరేగా ఉంది. 100వ సినిమా కాబట్టి భారీ యాక్షన్ షాట్, లేదంటే నాగార్జున ఫస్ట్ లుక్‌తో మొదలుపెడతారని అనుకోవచ్చు.

By:  M Prashanth   |   28 Aug 2026 5:55 PM IST
100వ సినిమా.. నాగ్ ఎంట్రీకి వింటేజ్ టచ్
X

నాగార్జున 100వ సినిమా నుంచి అసలు గ్లింప్స్ రావడానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. కానీ అంతకంటే ముందే అన్నపూర్ణ స్టూడియోస్ చిన్న టీజ్ వదిలింది. చీకట్లో వేగంగా దూసుకొస్తున్న ఓ వింటేజ్ కారు, మధ్యలో పాము గుర్తుతో కనిపించే హెచ్చరిక బోర్డు, చివర్లో ‘ది అరైవల్ ఆఫ్’ అంటూ ఇచ్చిన కట్‌తో వీడియో ముగిసింది. నాగ్‌ను ఒక్క ఫ్రేమ్‌లో కూడా చూపించకుండా, ఆయన ఎంట్రీ సెటప్ ఇందులో హైలైట్ అయింది.

ఇక్కడ కారు లుక్ కూడా కాస్త వేరేగా ఉంది. 100వ సినిమా కాబట్టి భారీ యాక్షన్ షాట్, లేదంటే నాగార్జున ఫస్ట్ లుక్‌తో మొదలుపెడతారని అనుకోవచ్చు. టీమ్ పాత మోడల్ కారును స్పీడ్‌గా తీసుకొచ్చి, ‘ఫాస్టెన్ యువర్ సీట్‌బెల్ట్స్’ అనే లైన్‌తో కింగ్ రాకను టీజ్ చేసింది. దీంతో రేపటి గ్లింప్స్‌లో నాగ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు అసలు పాయింట్.

ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటలకు బర్త్‌డే గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. ఇప్పటివరకు సినిమాను ‘కింగ్ 100’ పేరుతోనే ప్రమోట్ చేస్తున్నారు. రేపటి వీడియోతో అసలు టైటిల్ బయటకు వచ్చే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.

మ్యూజిక్ విషయంలో కూడా నాగ్ పాత కాంబినేషన్ మళ్లీ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ‘మన్మథుడు’, ‘మాస్’, ‘కింగ్’ తర్వాత నాగార్జునతో డీఎస్పీకి ఇప్పటికే గుర్తుండిపోయే ఆల్బమ్స్ ఉన్నాయి. 100వ సినిమాకు మళ్లీ అతడినే తీసుకోవడంతో గ్లింప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అయ్యింది. రాజా మహదేవన్ కెమెరామెన్, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నాడు. చిన్న టీజ్‌లోనే కారు విజువల్స్‌ను డార్క్ టోన్‌లో చూపించడం వల్ల సినిమా ఏ మూడ్‌లో ఉండబోతోందన్న డౌట్ కూడా వచ్చింది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన కథను టీమ్ ఇప్పటివరకు పెద్దగా బయటకు ఇవ్వలేదు. టబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకే ఈ చిన్న టీజ్‌లో కనిపించిన కారు, పాము గుర్తు కథకు సంబంధించిన క్లూలా లేక కేవలం నాగ్ ఎంట్రీ కోసం పెట్టిన డిజైన్‌లా అన్నది గ్లింప్స్ వచ్చిన తర్వాతే క్లియర్ అవుతుంది. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా అనగానే అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. ఇక టీమ్ ‘కింగ్’ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎలాంటి కంటెంట్ తో వస్తుందో చూడాలి. మిగతా నటీనటుల వివరాలను కూడా త్వరలోనే రివిల్ చేయనున్నారు.