100వ సినిమా కబుర్లు చెప్పిన కింగ్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కెరీర్ స్టార్టింగ్ నుంచే కొత్తదనానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే వారనే విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 18 Aug 2025 7:00 PM ISTటాలీవుడ్ మన్మథుడు నాగార్జున కెరీర్ స్టార్టింగ్ నుంచే కొత్తదనానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే వారనే విషయం తెలిసిందే. శివ సినిమా నుంచి అన్నమయ్య, శ్రీరామదాసు, రాజన్న, షిర్డీ సాయి, మనం, ఊపిరి ఇలా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. రీసెంట్ గా హీరోగానే కాకుండా సినిమాల్లోని కీలక పాత్రల్లో కనిపించి కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు కింగ్ నాగార్జున.
ల్యాండ్ మార్క్ మూవీ కోసం ఎన్నో జాగ్రత్తలు
ఇటీవల కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న నాగార్జున, ప్రస్తుతం కూలీ సినిమాతో సందడి చేస్తున్నారు. మొన్నీమధ్యే మనం సినిమాను జపాన్ లో రిలీజ్ చేసి అక్కడి నుంచి కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున హీరోగా మాత్రం కాస్త డౌన్ లోనే ఉన్నారని చెప్పాలి. అందుకే 99 సినిమాలు తీసిన ఆయన 100వ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి నాగ్ 100వ సినిమా ఈపాటికే వచ్చి ఉండాలి కానీ తన కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమా కావడంతో ఆ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని నాగ్ ప్లాన్ చేశారు.
తమిళ డైరెక్టర్‌తో..
ఈ నేపథ్యంలోనే ఎంతో మంది డైరెక్టర్లను కలిసి ఎన్నో కథలు విని ఆఖరికి ఇప్పుడో తమిళ డైరెక్టర్ కు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే వెల్లడించారు. రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తన్న జయమ్ము నిశ్చయమ్మురా సినిమాకు గెస్టుగా హాజరైన నాగ్, తన 100వ సినిమాకు సంబంధించిన వివరాలను తెలిపారు.
సంవత్సరం కిందటే తమిళ డైరెక్టర్ రా.కార్తీక్ తనకు ఓ కథ వినిపించారని, గత ఆరేడు నెలలుగా దానిపై వర్క్ జరుగుతుందని చెప్పిన నాగ్, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఆ సినిమా భారీ లెవెల్ లో ఉంటుందని, తన నెక్ట్స్ మూవీ అదేనని చెప్పారు. కింగ్100 టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్ట్ 29న నాగ్ బర్త్ డే కానుకగా వెలువడనుందట. ఈ సినిమా కోసం మేకర్స్ ఓ క్రేజీ లుక్ ను కూడా రెడీ చేశారని, నాగ్ పుట్టినరోజు నాడే ఆ లుక్ ను కూడా రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను నాగ్ తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ సంస్థలోనే నిర్మించనున్నారట.
