Begin typing your search above and press return to search.

100వ సినిమా.. కింగ్ రివర్స్ ప్లాన్..!

నాగార్జున మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

By:  Ramesh Boddu   |   13 Nov 2025 10:55 AM IST
100వ సినిమా.. కింగ్ రివర్స్ ప్లాన్..!
X

కింగ్ నాగార్జున శివ రీ రిలీజ్ హడావిడిలో ఉన్నాడు. మామూలుగా అయితే స్టార్ హీరోలు రీ రిలీజ్ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోరు ఫ్యాన్స్ ఉత్సాహం చూసి ఆనందిస్తారు. కానీ శివ రీ రిలీజ్ మాత్రం అలా కాదు. నాగార్జున దగ్గర ఉండి ఆ పనులు చూసుకున్నారు. అంతేకాదు ఎలా ఐతే 36 ఏళ్ల క్రితం ఆర్జీవితో కలిసి పనిచేయించారో అలా ఇప్పుడు 4కె ప్రింట్ కోసం కూడా ఆర్జీవిని 8 నెలల పాటు ఈ పనికి యూజ్ చేసుకున్నారు. శివ సినిమా ఆర్జీవి అంటే ఏంటో సినిమా ప్రపంచానికి పరిచయం చేసింది. అందుకే ఆ సినిమా మీద ఆ అవకాశం ఇచ్చిన నాగార్జున మీద ఆర్జీవీకి ఎప్పుడు అభిమానం ప్రేమ ఉంటాయి.

శివ రిలీజ్ హడావిడిలో నాగార్జున..

ఐతే నాగార్జున శివ రిలీజ్ హడావిడిలో పడిపోయి తన నెక్స్ట్ సినిమా గురించి మర్చిపోయారు. నాగార్జున మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో తమిళ దర్శకుడు కార్తీక్ వర్క్ చేస్తున్నాడని బాగా వస్తుందని అన్నారు నాగార్జున. ఐతే ఇందులో మరో మెలిక ఉందని తెలుస్తుంది. స్క్రిప్ట్ కి నాగార్జున ఎగ్జైట్ అయ్యారు కానీ అది ఎలా తీస్తాడు అన్నది డౌటే అందుకే ముందు కొంత పార్ట్ రష్ చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలని అనుకుంటున్నారట.

అందుకే అఫీషియల్ గా నాగ్ 100వ సినిమా అనౌన్స్ మెంట్ చేయట్లేదు. నాగార్జున 100వ సినిమా స్టార్ డైరెక్టర్ తో చేయొచ్చు కానీ ఈసారి కంటెంట్ ఉన్న సినిమా అది కూడా యువ దర్శకుడితో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు. అందుకే కార్తీక్ ని ఎంపిక చేసుకున్నారు. అతను చెప్పిన కథ బాగున్నా ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంది. నాగార్జునకు ఇది అన్ని సినిమాల్లా కాదు.. 100వ సినిమా కచ్చితంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే నాగార్జున ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వాళ్లు ఎంత తొందర పెట్టినా కూడా నాగార్జున మాత్రం..

నాగార్జున హండ్రెడ్త్ మూవీ విషయంలో ఈ జాగ్రత్తలు అన్నీ కూడా సినిమా బాగా రావడం కోసమే అని తెలుస్తుంది. ఇంతకీ నాగార్జున ఏ జోనర్ లో ఈ సినిమా చేయబోతున్నారు. అందులో ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయి.. సినిమా గురించి ఎప్పుడు అఫీషియల్ అప్డేట్ వస్తుంది అన్నది ఆడియన్స్ అడుగుతున్నారు. ఐతే వాళ్లు ఎంత తొందర పెట్టినా కూడా నాగార్జున మాత్రం తాను చెప్పాలనుకున్నప్పుడే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఓ పక్క బిగ్ బాస్ సీజన్ 9 హోస్టింగ్ లో కూడా నాగార్జున బిజీ బిజీగా ఉన్నారు. తప్పకుండా నాగ్ 100వ సినిమా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లోనే ఉంటుందని.. అలా ఉండాలని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా కోరుతున్నాడు.