Begin typing your search above and press return to search.

కింగ్ సినిమా కోసం స‌రికొత్త టెక్నాల‌జీ!

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 100వ సినిమా సైలెంట్‌గా స్టార్ట్ అయింది. శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

By:  Ravindar Gorantla   |   1 April 2026 5:56 PM IST
కింగ్ సినిమా కోసం స‌రికొత్త టెక్నాల‌జీ!
X

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 100వ సినిమా సైలెంట్‌గా స్టార్ట్ అయింది. శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. నాగ్ కెరీర్‌లోనే మైలురాయి లాంటి మెమ‌ర‌బుల్ మూవీ కావ‌డంతో నాగార్జున ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏ విష‌యాన్ని కూడా లైట్‌గా తీసుకోవ‌డం లేదు. డైరెక్ట‌ర్‌, టెక్నీషియ‌న్స్‌, హీరోయిన్స్‌, కీల‌క న‌టీన‌టులు, క‌నిపించే తీరు..ఇలా ప్ర‌తి ఒక్క‌టీ ప్ర‌త్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే షూటింగ్‌మొద‌లు పెట్టిన ఈ సినిమాలో అన్నీ స‌ర్ ప్రైజ్‌లేన‌ని తెలిపింది.

అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ ప్ర‌ధానంగా క‌నిపించే అ మూవీలో కింగ్ నాగార్జున్ క‌నిపించే విధానం చాలా కొత్త‌గా ఉంటుంద‌ని అంతా అంటున్నారు. ఇందులోని కీల‌క పాత్ర‌ల్లో ట‌బుతో పాటు ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. గ‌త కొంత కాలంగా సోలో హీరోగా వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్న నాగార్జున ఈ సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో వర్క్ చేస్తున్నార‌ట‌.

ఈ ప్రాజెక్ట్‌ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నాగార్జున చాలా ప్ర‌త్యేకంగా ఉండేలా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది కొత్త ద‌ర్శ‌కుల‌ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన నాగార్జున త‌న వంద‌వ సినిమాకు రా. కార్తీక్ అనే కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీ కోసం స‌రికొత్త టెక్నాల‌జీని వాడుతున్నార‌ని, డీ ఏజింగ్ టెక్నాల‌జీతో ఈ మూవీని చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ మూవీలో నాగార్జున 20 ఏళ్ల యువ‌కుడి నుంచి 60 ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తిగా క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్నార‌ని, ఈ సినిమా కోసం ఉప‌యోగిస్తున్న డీ ఏజింగ్ టెక్నాల‌జీ టాలీవుడ్‌లోనే ప్ర‌త్యేకంగా నిలిచే ప్ర‌యోగంగా నిలిచిపోతుంద‌ని, విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో ఈ సినిమా స‌రికొత్త స్టాండ‌ర్డ్స్‌ని సెట్ చేస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఫాద‌ర్ అండ్ డాట‌ర్ నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాగా దీన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసింది. ఈ మూవీలోని ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో సుహ్మిత‌భ‌ట్‌, విజ‌యేంద్ర న‌టిస్తున్నారు. ఇక ఇందులోని కీల‌క అతిథి పాత్ర‌ల్లో అక్కినేని న‌ట వార‌సులు నాగ‌చైత‌న్య అక్కినేని, అఖిల్ అక్కినేని న‌టిస్తార‌ని తెలిసింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని మేక‌ర్స్ త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డిస్తార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.