Begin typing your search above and press return to search.

బిజీగా మారనున్న నాగార్జున.. 100వ చిత్రం ప్రత్యేకత ఇదే!

అక్కినేని నాగార్జునకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. మల్టీ స్టారర్ సినిమాలతో దుమ్ము దులుపుతున్నారు.

By:  Madhu Reddy   |   25 Aug 2025 1:00 AM IST
బిజీగా మారనున్న నాగార్జున.. 100వ చిత్రం ప్రత్యేకత ఇదే!
X

అక్కినేని నాగార్జునకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. మల్టీ స్టారర్ సినిమాలతో దుమ్ము దులుపుతున్నారు. అయితే ఈయన ఈ ఏడాది చేసిన సినిమాల్లో హీరోగా చేయకపోయినప్పటికీ.. ఆయన పాత్రలు ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయాయి. అయితే అలాంటి నాగర్జున త్వరలోనే అటు బిగ్ బాస్ సీజన్ 9తో పాటూ.. ఇటు తన 100వ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారట. మరి నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలవబోతున్న 100వ సినిమా ముచ్చట్లు ఏంటి? ఆయన తన కెరీర్ ని ఈ ఏడాది ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇతర హీరోల సినిమాలలో కీ రోల్స్ పోషిస్తున్న నాగార్జున..

అక్కినేని నాగార్జున ఈ ఏడాది కూలీ,కుబేర వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో కుబేర సినిమాలో పాజిటివ్ పాత్రలోనే నటించినప్పటికీ, కూలీ మూవీలో మాత్రం నెగటివ్ పాత్రలో నటించారు. హీరోగానే కాదు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి కూడా నాగార్జున వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా తనకున్న స్టార్డం పక్కన పెట్టి వేరే హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషించడం అంటే అంత సులువైన పని కాదు. నాగార్జున కుబేర మూవీలో చేసిన దీపక్ పాత్రని చాలామంది ప్రశంసించారు. అలాగే కూలీ సినిమాలోని సైమన్ పాత్రను కూడా మెచ్చుకున్నారు. ఈ రెండు సినిమాల్లో నాగార్జున పోషించిన పాత్రలకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇతర ఇండస్ట్రీలో కూడా ఆయనకి మార్కెట్ పెరిగింది.

100వ సినిమా ప్రత్యేకమంటున్న నాగ్..

అలా ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకులు నాగార్జునని మెచ్చుకున్నారు. అయితే అలాంటి నాగార్జున త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9తో పాటు తన 100వ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారట. అయితే ఈ ఏడాది బిజీ బిజీగా గడుపుతున్న నాగార్జున 100వ సినిమా కోసం టైం తీసుకోవాలి అనుకోవడం లేదట.ఈ ఏడాదిలోనే ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే నాగార్జున తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయే తన 100వ సినిమా కోసం తమిళ డైరెక్టర్ ని ఎంచుకున్నట్టు రీసెంట్ గా ఓ టాక్ షోలో బయటపెట్టారు. తమిళ డైరెక్టర్ అయినటువంటి కార్తీక్ తో తన 100వ సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమవబోతుంది..

ఇటు బిగ్ బాస్ అటు 100వ సినిమా.. ఫుల్ బిజీ..

ఇక నాగార్జున 100వ సినిమాతో పాటు బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్టుగా చేస్తున్నారు.అలా ఓవైపు రియాల్టీ షోకి మరోవైపు సినిమా షూటింగ్లో అలా రెండింటిని ఒకేసారి షూటింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. బిగ్ బాస్ ఎపిసోడ్ లతో పాటు సినిమా షూటింగ్ కి కూడా తన సమయాన్ని కేటాయించబోతున్నారు. అలా ఏడాది బిజీయెస్ట్ హీరోగా నాగార్జున దూసుకుపోతున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాగార్జున తన 100వ సినిమాలో చాలా డైనమిక్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్ ఫ్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ లో తెరకెక్కుతోంది.కింగ్ 100 అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. నాగార్జున కెరీర్లో మైల్ స్టోన్ గా నిలవబోతున్న ఆయన 100వ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.