Begin typing your search above and press return to search.

శోభిత ఒక ఆణిముత్యం.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న డైరెక్టర్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు సొంతం చేసుకున్న నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఈ రోజుకు ఏడాది కావస్తోంది.

By:  Madhu Reddy   |   4 Dec 2025 6:34 PM IST
శోభిత ఒక ఆణిముత్యం.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న డైరెక్టర్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు సొంతం చేసుకున్న నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఈ రోజుకు ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే దాదాపు రెండు సంవత్సరాల ప్రేమాయణం తర్వాత ఎట్టకేలకు 2024 జూన్ లో నిశ్చితార్థం చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన ఈ జంట.. అదే ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహం ముందు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు.




ఇకపోతే చైతన్యకు ఇది రెండవ వివాహమే అయినా.. శోభితకు తొలి వివాహం కావడం గమనార్హం. ఇకపోతే అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో తమ పెళ్లి గురించి ఎక్కడ ఎక్కువగా చర్చ లేకుండా చూసుకున్నారు ఈ జంట. పైగా పెళ్లి తర్వాత కేవలం కొన్ని ఫోటోలు మాత్రమే పంచుకున్నారు. పైగా అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రమే వీరి పెళ్లి ఫోటోలను అభిమానులతో షేర్ చేసింది. ఇక వివాహం తర్వాత పెద్దగా హడావిడి చేయని ఈ జంట ఈరోజు ఏడాది పూర్తి చేసుకోవడంతో తమ తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక అదిరిపోయే వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసింది శోభిత.

ముఖ్యంగా తమ పెళ్లిని కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంత సంబరంగా జరుపుకున్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వివాహం సందర్భంగా వీళ్ళు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. పైగా జీవిత భాగస్వాముల గురించి ఒకరికొకరు చాలా చక్కగా ఇందులో వివరించారు. "ఇంకొకరు వచ్చి తమ జీవితాల్లో ఖాళీలు పూరించాల్సిన అవసరం లేదని.. తాము వ్యక్తులుగా అప్పటికే సంపూర్ణమని.. కానీ చైతన్య లేకపోతే తన జీవితం పూర్తిగా అసంపూర్ణం" అంటూ శోభిత చెప్పగా.. నాగచైతన్య మాట్లాడుతూ.." ఆమె నా సొంతం అన్నప్పుడు కలిగిన ఫీలింగ్ చాలా గొప్పది. తను తోడుంటే ఏదైనా సాధించగలను అనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు చెప్పిన తీరు అందరిని మరింతగా ఆకట్టుకుంది.

ఇకపోతే ఈరోజు తొలి వివాహ వార్షికోత్సవం కావడంతో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు.. నాగచైతన్యకు అత్యంత సన్నిహితుడు అయిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి తాజాగా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అంతేకాదు ఇప్పటివరకు ఆమెపై నెగిటివ్ క్రియేట్ చేసిన వారికి మేలుకొలుపు లా ఉందని చైతూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "నిశ్శబ్దాన్ని మించిన శబ్దం లేదు. ఈ విషయంలో మీరు గొప్ప ఉదాహరణ శోభిత అక్కినేని.. మీరు ఒక ఆణిముత్యం" అంటూ.. చైతూ , శోభిత పెళ్లికి సంబంధించిన ఫోటోని చందు మొండేటి పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

చందు మొండేటి విషయానికొస్తే.. 2014లో హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో కార్తికేయ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన.. నాగచైతన్యతో ఏకంగా మూడు చిత్రాలు చేశారు. ప్రేమమ్, సవ్యసాచి, తండేల్ అంటూ ఏకంగా మూడు చిత్రాలు చేయడమే కాకుండా ఈ చిత్రాలతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు ఈ సినిమాల సమయంలోనే చైతన్యతో మంచి అనుబంధం కూడా ఏర్పడింది. అంతేకాదు అటు శోభితకి కూడా చందు బాగా క్లోజ్. పైగా నాగచైతన్యను శోభిత వివాహం చేసుకున్న సమయంలో సమంత అభిమానులు శోభితపై ఎక్కడ లేని నెగిటివిటీని క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు సమంత కూడా మరో వివాహం చేసుకోవడంతో శోభితపై వచ్చిన నెగిటివిటీ కాస్త చందు పోస్ట్ తో పక్కకు వెళ్ళిపోయింది. ముఖ్యంగా శోభిత వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియజేస్తూ చందు పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.