Begin typing your search above and press return to search.

నాగచైతన్య.. మరోసారి జోష్ స్టైల్ లో

జోష్‌ సినిమాతో అక్కినేని ఇంటి నుంచి ముడో తరం హీరోగా నాగచైతన్య ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

By:  M Prashanth   |   6 Sept 2025 4:00 AM IST
నాగచైతన్య.. మరోసారి జోష్ స్టైల్ లో
X

జోష్‌ సినిమాతో అక్కినేని ఇంటి నుంచి ముడో తరం హీరోగా నాగచైతన్య ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అన్నో అంచనాలతో చైతు సినీ రంగంలోకి వచ్చారు. అలా ఆయన తెరంగేట్రం చేసి అప్పుడే 16ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కెరీర్ లో ఎన్నో ఆటు పోట్లు ఎదురైనా చైతు బలంగా నిలబడ్డారు. జోష్ సినిమాతో ఫర్వాలేదనిపించిన ఆయన.. రెండో సినిమా ఏమాయ చేసావెతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా చైతన్య కెరీర్ లో మైలురాయిగా మిగిలిపోయింది. ఆ తర్వాత 100% లవ్‌, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్‌, బంగార్రాజు, లవ్ స్టోరీ ఇలా మంచి విజయాల్ని సొంతం చేసుకొన్నారు. ఇక ఇటీవల తండేల్‌ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నాగ చైతన్య. ప్రస్తుతం చైతూ.. కెరీర్‌లో 24వ చిత్రం చేస్తున్నారు.

NC24 ప్రాజెక్ట్ టైటిల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తనకు కెరీర్ లో జోష్ సినిమా మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. కాలేజీ స్టూడెంట్ పాత్రలో చైతూ ఆకట్టుకున్నాడు. సినిమాలోని డైలాగులు, కాలేజీ పాలిటిక్స్, చెబితే వినేవాడు అసలు స్టూడెంటే కాదు.. అనే డైలాగ్ ఇవన్నీ సినిమాను స్పెషల్ గా చూపించాయి.

విద్యార్థిగా జోష్ సినిమా నాగచైతన్య నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి. కానీ, జోష్ తర్వాత నాగచైతన్య ట్రాక్ మార్చేశారు. ఆ తర్వాత అన్నీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోనే కనిపించారు. కొత్త పాత్రలు ట్రై చేయలేదు. అందుకే మరోసారి చైతన్య స్టూడెంట్ పాత్రలో కనిపించిన ఫ్యాన్స్ కు కనువిందు చేయాలని భావిస్తున్నారట. తన కెరీర్ లో రానున్న సినిమాలో పవర్ఫుల్ స్టూడెంట్ రోల్ సో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి చైతు స్టోరీ కూడా విని, ఫైనలైజ్ చేశారని సమాచారం.

తన అప్ కమింగ్ సినిమాల్లో ఎన్ సీ 24తోపాటు, ఈ స్టూడెంట్ రోల్ సినిమా కూడా ఉందట. అయితే ఈ సినిమా తెరకెక్కించే డైరెక్టర్, ప్రొడక్షన్ బ్యానర్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ ఏది ఏమైనా నాగచైతన్య మరోసారి స్టూడెంట్ రోల్ లో కనిపించనున్నాడన్న వార్త బయటకు రాగానే.. అక్కినేని ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చింది.