నాగచైతన్య ప్రాజెక్ట్‌కు హీరోయిన్ టెన్షన్!
అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు నాగచైతన్య. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం కమర్షియల్ స్టార్‌గా స్టార్‌డమ్‌ని, అందుకు తగ్గ బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకోలేకపోతున్నాడు.
By: Ravindar Gorantla | 4 March 2026 3:00 PM ISTఅక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు నాగచైతన్య. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం కమర్షియల్ స్టార్‌గా స్టార్‌డమ్‌ని, అందుకు తగ్గ బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకోలేకపోతున్నాడు. `తండేల్` మూవీతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన చైతూ ఇప్పుడిప్పుడే కమర్షియల్‌గా కొత్త తరహా సినిమాలని ఎంచుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం `విరూపాక్ష` ఫేమ్ కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ `వృషకర్మ`లో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఫిబ్రవరి 5న భారీ స్థాయిలో ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జక జకా జరిగిపోతున్నాయి. చైతూ డిఫరెంట్ లుక్‌లో నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ తరువాత నాగచైతన్య చేయబోయే ప్రాజెక్ట్ ఏంటీ? అనే చర్చ ప్రస్తుతం అభిమానుల్లో జరుగుతోంది. ఈ సినిమా తరువాత చైతూ క్రేజీ లైనప్‌ని రెడీ చేసేకుంటున్నారు. దీనితో పాటు మరో రెండు క్రేజీ మూవీస్‌కి రెడీ అవుతున్నాడు.
`సోగ్గాడే చిన్నినాయనా`, బంగార్రాజు సినిమాలని అందించిన కల్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్‌లో ఫాదర్ నాగార్జునతో కలిసి మరో ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఫైనల్‌గా స్క్రిప్ట్ లాక్ చేసిన తరువాత ఈ ప్రాజెక్ట్‌ని అధికారకింగా ప్రకటించనున్నారు. సంక్రాంతి సెంటిమెంట్ నేపథ్యంలో రానున్న ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీనికి `బెదురులంక` ఫేమ్ క్లాక్స్ దర్శకుడు.
చైతూకు క్లాక్స్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ మూవీని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ కారణంగానే చైతూ దీని కోసం షెడ్యూల్‌కి 20 రోజులు చొప్పున మూడు షెడ్యూల్స్‌కి గానూ 60 రోజుల పాటు డేట్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అయితే ఇంత వరకు ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు. నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వగల హీరోయిన్ కోసం టీమ్ అన్వేషిస్తోందని తెలిసింది.
అంతే కాకుండా చైతూతో పాటు హీరోయిన్ కూడా అరవై రోజులు షూటింగ్ కోసం కేటాయించాలట. అదే ఇప్పుడు టీమ్‌కు సమస్యగా మారింది. హీరోయిన్ సెట్టయితే టీమ్ అధికారికంగా సినిమాని ప్రకటించడానికి రెడీగా ఉన్నారు. పేరున్న హీరోయిన్ దొరకపోతే కొత్త అమ్మాయిని తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా టీమ్ చేస్తోందట. సరికొత్త కథ నేఫథ్యంలో రూపొందనున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ కోసం చైతూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.
