'నాగబంధం' ట్రైలర్ తో గూస్ బంప్సే.. మరింత హైప్ పెరిగేలా..
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ నాగబంధం మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
By: M Prashanth | 19 Jun 2026 5:57 PM ISTపాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ నాగబంధం మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, పాటలతో ఆసక్తిని రేకెత్తించిన ఆ చిత్రం తాజాగా విడుదలైన ట్రైలర్ తో హైప్ మరింత పెంచింది. డైరెక్టర్ అభిషేక్ నామా తన విజన్ ను మరోసారి ట్రైలర్ ద్వారా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే గూస్ బంప్సే!
జూలై 3న విడుదల కానున్న ఆ సినిమా ద్వారా ఇండియన్ కల్చర్, డివోషనల్ ఎలిమెంట్స్ ను మోడ్రన్ విజువల్ టెక్నాలజీతో మిక్స్ చేసి గ్రాండ్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. మూడు నిమిషాల 19 సెకన్ల రన్ టైమ్ తో ఉన్న ట్రైలర్ ప్రారంభం నుంచే ఆసక్తిని పెంచేలా రూపొందించారు. కథ మొత్తం బ్రహ్మ కమలం అనే డివోషనల్ ఫ్లవర్ చుట్టూ తిరుగుతున్నట్లు చూపించారు.
ఆ ఫ్లవర్ ను సొంతం చేసుకుంటే అనేక శక్తులు, కోరికలు నెరవేరుతాయనే అంశాన్ని హైలైట్ చేశారు. అదే పవర్ ను సొంతం చేసుకోవడానికి దుష్ట శక్తులు, రాక్షసులు చేసే ప్రయత్నాలు కథకు ప్రధాన బలంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు పురాతన దేవాలయాలు, గుప్తనిధులు, వేల ఏళ్లుగా దాగి ఉన్న రహస్యాలను కథలో భాగం చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా 108 విష్ణు దేవాలయాల నేపథ్యంలో కథను అల్లినట్లు కనిపిస్తోంది.
'గుప్తనిధుల్లో దాగి ఉన్న ఖజానా భూమిని మాత్రమే శాసిస్తుంది.. కానీ బ్రహ్మ కమలం బ్రహ్మాండాన్నే శాసిస్తుంది' అనే డైలాగ్ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఒక్క డైలాగ్ తో స్టోరీ రేంజ్ ఎంత పెద్దదో తెలియజేసే ప్రయత్నం చేశారు. హీరో విరాట్ కర్ణ సినిమాలో రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఒకవైపు సాహస యాత్రికుడిగా, మరోవైపు నాగసాధువుగా ఆయన రోల్ రూపొందింది.
ముఖ్యంగా పరమశివుడి ఉగ్రరూపాన్ని తలపించే కొన్ని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. పాత్ర కోసం ఆయన చేసిన మేకోవర్, బాడీ లాంగ్వేజ్ లో మార్పులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ హీరోయిన్లు నటిస్తుండగా, అనసూయ లీలావతి పాత్రలో మిస్టీరియస్ షేడ్ తో కనిపించనున్నారు. కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ అఘోరా పాత్రలో కనిపించడం విశేషం. జగపతిబాబు, జయప్రకాష్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.
టెక్నికల్ కూడా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భారీ సెట్స్, పురాతన గుళ్ల డిజైన్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్.. మూవీ రేంజ్ ను క్లియర్ గా చూపిస్తున్నాయి. జునైద్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను మరింత ఎఫెక్టివ్ గా మార్చింది. మైథాలజీ, ఫాంటసీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ గా మిక్స్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఒక మనిషి స్వార్థం, దాని వల్ల సంభవించే సమస్యలు, దైవశక్తి జోక్యం, పురాతన రహస్యాల అన్వేషణ వంటి అంశాలతో నాగబంధం మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. భారీ క్యాస్టింగ్ లేకపోయినా, స్టోరీ, విజువల్స్, టెక్నికల్ వాల్యూస్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది మూవీ టీమ్. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే జులై 3న విడుదల కానున్న ఆ చిత్రం ప్రేక్షకులకు కొత్త విజువల్ అనుభూతిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
