Begin typing your search above and press return to search.

ఇలాంటి విజువల్స్ పెద్ద హీరోకు పడుంటే..?

టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఒక టీజర్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అది ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఇండస్ట్రీ ప్రముఖులు చాలామంది చూశారు.

By:  Garuda Media   |   15 Feb 2026 6:36 PM IST
ఇలాంటి విజువల్స్ పెద్ద హీరోకు పడుంటే..?
X

టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఒక టీజర్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అది ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఇండస్ట్రీ ప్రముఖులు చాలామంది చూశారు. టీజర్ లాంచ్‌కు ఒక రోజు ముందు మీడియా ప్రతినిధులు కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని బిగ్ స్క్రీన్ మీద ఆ టీజర్ చూశారు. అది చూసి ఆశ్చర్యపోని వారు లేరు. ఇన్నాళ్లూ నిర్మాతగా ఉన్న అభిషేక్ నామా ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు.

అభిషేక్.. కళ్యాణ్ రామ్ సినిమా ‘డెవిల్’ సినిమాను కూడా మధ్యలో తన చేతుల్లోకి తీసుకుని పూర్తి చేశారు. కానీ ఆ సినిమా ఆయన తీశారంటే జనానికి నమ్మకం కుదరలేదు. ఐతే నా టాలెంట్ ఏంటో ఇప్పుడు చూడండి అన్నట్లుగా ‘నాగబంధం’ తీసినట్లుగా కనిపిస్తోంది. ‘నాగబంధం’ టీజర్లో విజువల్స్ చూడడానికి రెండు కళ్లు చాలని పరిస్థితి. ‘పెదకాపు’తో హీరోగా పరిచయం అయిన విరాట్ కర్ణను పెట్టి ఇంత భారీగా సినిమా తీయడం.. అలాంటి విజువల్స్ రాబట్టడం అన్నది అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

నభా నటేష్, ఐశ్వర్య మీనన్, గరుడ రామ్, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, అనసూయ.. ఇలా పెద్ద కాస్టింగే పెట్టుకున్నాడు అభిషేక్. కాస్టింగ్ కంటే కూడా ఇందులో లొకేషన్లు, సెట్స్, విజువల్స్, వీఎఫెక్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక కొత్త హీరో మీద ఇంత పెట్టుబడి పెట్టడం ఏంటి అని షాకవుతున్నారు. బడ్జెట్ ఎంత పెట్టారో కానీ.. ఔట్ పుట్ మాత్రం అదిరిపోయింది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

రెండు పాత్రల్లో విరాట్ కర్ణ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అతడినేమీ తక్కువ చేయాల్సిన పని లేదు కానీ.. ఇదే క్యారెక్టర్ని ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో చేసి ఉంటే.. ఈ సినిమాకు వచ్చే హైప్ వేరుగా ఉండేది. సినిమా లెవెల్ మారడమే కాక.. ఆ స్టార్ హీరో కెరీర్లో కూడా ఒక మైలురాయి అయ్యే అవకాశముండేది. కానీ అలా ఆలోచించకుండా కొత్త హీరో మీద ఇంత బడ్జెట్ పెట్టి, ఇలాంటి ఔట్ పుట్ తీసుకురావడమే షాకింగ్.