Begin typing your search above and press return to search.

'నాగబంధం' రెండో సింగిల్.. డ్రమ్ బీట్స్ తో అదిరిపోయేలా..

టాలీవుడ్‌ లో వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై మరో భారీ పాన్ ఇండియా చిత్రం నాగబంధం తెరకెక్కుతోంది.

By:  M Prashanth   |   19 April 2026 12:38 PM IST
నాగబంధం రెండో సింగిల్.. డ్రమ్ బీట్స్ తో అదిరిపోయేలా..
X

టాలీవుడ్‌ లో వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై మరో భారీ పాన్ ఇండియా చిత్రం నాగబంధం తెరకెక్కుతోంది. యువ నటుడు విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. మైథలాజికల్ టచ్‌ తో కూడిన అడ్వెంచరస్ థ్రిల్లర్‌ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌ పై సినీ ప్రియుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.




నాగబంధం కథ 1750ల కాలం నేపథ్యంలో సాగుతుందని సమాచారం. పురాతన నిధులు, నాగబంధం సంప్రదాయం, దైవిక శక్తులు వంటి ఆసక్తికర అంశాల చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పురాతన దేవాలయాల్లో దాగి ఉన్న రహస్యాలు, వాటిని కాపాడే శక్తులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మిస్టరీ, భక్తి, అడ్వెంచర్ అంశాలతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా విడుదల చేసిన మొదటి పాట కూడా ఆకట్టుకుంది. తాజాగా సుర సుర అంటూ సాగే రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ఆ పాట మాస్, ఎనర్జిటిక్ స్టైల్‌ లో ఉండి, పెళ్లి సంబరాలు నేపథ్యంలో షూట్ చేశారు.

సాంగ్ లో హీరో విరాట్ కర్ణతో పాటు హీరోయిన్లు నభా నటేష్, ఐశ్వర్యా మేనన్ తమ డ్యాన్స్‌ లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా డ్రమ్స్ బీట్లు, ఫోక్ ఎలిమెంట్స్ కలిసిన సంగీతం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పెళ్లి వేడుకల్లో కనిపించే ఆనందం, ఉత్సాహాన్ని పాటలో ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, కలర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌ ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.

పాటకు జునైద్ కుమార్, అభే సంగీతం అందించగా, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. ఫోక్ టచ్‌ తో పాటు సినిమాటిక్ ఆర్కెస్ట్రేషన్ కలిపి పాటను ఫెస్టివ్ సాంగ్‌ గా మలిచారు. గాయకులు అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ తమ స్వరాలు అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం.. సంప్రదాయం, సంబరాలు, కలిసికట్టుగా ఉండే ఆనందాన్ని చక్కగా రిఫ్లెక్ట్ చేస్తోంది.

ఇక సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర కథలో కీలక మలుపు తీసుకురానుందని సమాచారం. ఈ చిత్రం అభిషేక్ పిక్చర్స్, లక్ష్మీ ఐరా దేవాన్స్ నామ ప్రెజెంట్స్ బ్యానర్‌ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి నాగబంధం మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.