ఈ వీకెండ్ బాక్సాఫీస్ విజేత ఎవరో?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు ఈవారం మోస్ట్ అవైటెడ్ మూవీస్ 'నాగబంధం', 'రావు బహదూర్' వచ్చిన విషయం తెల్సిందే. రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కింది.
By: Ramesh Palla | 4 July 2026 3:38 PM ISTటాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు ఈవారం మోస్ట్ అవైటెడ్ మూవీస్ 'నాగబంధం', 'రావు బహదూర్' వచ్చిన విషయం తెల్సిందే. రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కింది. నాగబంధం సినిమా వీఎఫ్‌ఎక్స్‌తో మెప్పించారంటూ రివ్యూలు వచ్చాయి. ఇక రావు బహదూర్ సినిమాలోని సత్యదేవ్ యాక్టింగ్, క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నాయంటూ ప్రేక్షకులు, రివ్యూవర్స్ మాట్లాడుతున్నారు. రివ్యూలు ఎలా ఉన్నా.. ఫస్ట్ డే రిపోర్ట్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలను చూస్తున్నారు. కొన్ని సినిమాలు హిట్ టాక్ వచ్చినా వీకెండ్‌లో థియేటర్లు ఫుల్ కావడం లేదు. కొన్ని సినిమాలకు నెగటివ్ టాక్ వచ్చినా శని, ఆదివారాల్లో థియేటర్ల వద్ద భారీగా జనాలు ఉంటున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు జనాలు ఎక్కువగా థియేటర్ల వద్ద క్యూ కడుతారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
సమంత మా ఇంటి బంగారం సినిమా కలెక్షన్స్...
ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలు సైతం తాము పోటీలో ఉన్నాం అన్నట్లుగా నిలిచాయి. వాటిల్లో ప్రధానంగా సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మా ఇంటి బంగారం గతం వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే డీసెంట్ వసూళ్లు రాబట్టింది. పెట్టిన బడ్జెట్‌కి, సమంత మార్కెట్‌కి అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు నమోదు అయ్యాయి. మా ఇంటి బంగారం సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ గత వీకెండ్ బ్రహ్మరథం పట్టారు. సెకండ్ షో లు సైతం హౌస్ ఫుల్ అయ్యాయని, కొన్ని స్క్రీన్స్ సైతం పెంచారు అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందింది. అంతటి హిట్ అందుకున్న మా ఇంటి బంగారం కచ్చితంగా రెండో వీకెండ్‌లోనూ అంతో ఇంతో ప్రభావం చూపించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సత్యదేవ్ రావు బహదూర్ మూవీ...
ఈ వీకెండ్‌లో ప్రేక్షకులు ఎక్కువగా నాగబంధం సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో జరిగిన సర్వేలో వెళ్లడి అయింది. ఆ తర్వాత మా ఇంటి బంగారం సినిమాను గత వీకెండ్‌లో చూడలేని వారు చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టేందుకు రెడీ అయ్యారు. ఇక సత్యదేవ్ ను అభిమానించే వారు, పైగా మహేష్ బాబు పై నమ్మకం ఉన్న వారు రావు బహదూర్ సినిమాను చూసేందుకు థియేటర్‌కి వెళ్లబోతున్నారు. మొత్తంగా నాగబంధం, మా ఇంటి బంగారం, రావు బహదూర్ సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం. గత కొన్ని నెలలుగా వీకెండ్‌లో చూడ్డానికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ వారం ఏకంగా మూడు సినిమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మూడు సినిమాల్లో ఏది చూడాలా అనుకునేట్లుగా ఉన్నాయి.
నాగబంధం సినిమా వీఎఫ్‌ఎక్స్...
గత వారంతో పోల్చితే మా ఇంటి బంగారం కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు పెద్ద సినిమాల నుంచి పెద్ద పోటీ లేని కారణంగా మా ఇంటి బంగారం సినిమా సైతం రెండో వారం కనుక నాగబంధం, రావు బహదూర్ సినిమాలకు కలిసి వచ్చే అవకాశం. మరో వైపు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొంది మూడు వారాల క్రితం వచ్చిన 'పెద్ది' సినిమా సైతం ఇంకా అక్కడ అక్కడ స్క్రీన్స్‌లో ఆడుతోంది. ఈ వారంతో సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అవుతుంది. కనుక ఈ వీకెండ్‌లో మరోసారి రామ్ చరణ్ అభిమానులు పెద్ది థియేటర్‌లో చూసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చాలా స్క్రీన్స్ నుంచి పెద్దిని తొలగించిన నేపథ్యంలో ఈ వారం పెద్ది జోరు ఉండక పోవచ్చు. కానీ మా ఇంటి బంగారం, నాగబంధం, రావు బహదూర్ సినిమాలు పోటీ పడే అవకాశం ఉంది. ఈమూడు సినిమాల్లో ఈ వీకెండ్ మీరు చూడాలి అనుకుంటున్న సినిమా ఏంటి కామెంట్ చేయండి.
