ఫాంటసీ & మిస్టరీ స్టోరీస్ బూమ్.. కొత్త జనరేషన్‌కు ఎందుకు ఇంత ఆకర్షణ?
ఈ డిజిటల్ యుగంలో యువత రోజూవారీ రొటీన్ లైఫ్, స్ట్రెస్ నుంచి కాసేపు బయటపడటానికి ఇష్టపడుతోంది. ఫాంటసీ, మిస్టరీ కథలు ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి.
By: Madhu Reddy | 28 Jun 2026 1:30 AM ISTఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. లవ్, యాక్షన్ సినిమాల కంటే ఎక్కువగా ప్రేక్షకులు 'ఫాంటసీ, మిస్టరీ, మైథాలజీ' కథల వైపు బాగా ఆకర్షితులవుతున్నారు. తాజాగా అభిషేక్ నామా డైరెక్షన్‌లో విరాట్ కర్ణ హీరోగా వస్తున్న 'నాగబంధం' అనే విజువల్ అడ్వెంచర్ సినిమాకు రిలీజ్ ముందే వస్తున్న క్రేజ్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఈ ఆధునిక డిజిటల్ యుగంలో కొత్త జనరేషన్ మన రూట్స్ వైపు ఎందుకు ప్రయాణిస్తోంది? ఈ జోనర్ కథల బూమ్‌కి గల అసలు కారణాలు ఏంటో చూద్దాం..
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా 'నాగబంధం' నిలిచింది. ఇక టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్‌తో ఈ సినిమా సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. జూలై 3న విడుదల కాబోతున్న ఈ చిత్రం రిలీజ్ కాకముందే భారీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసింది. నైజాంలో దిల్ రాజు, సీడెడ్‌లో శ్రీ గురు రాఘవేంద్ర, అలాగే ఓవర్సీస్ అండ్ నార్త్ ఇండియాలో జీ స్టూడియోస్ వంటి టాప్ డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడం ఈ జోనర్‌కు ఉన్న క్రేజ్‌ను చెప్తోంది.
ఈ డిజిటల్ యుగంలో యువత రోజూవారీ రొటీన్ లైఫ్, స్ట్రెస్ నుంచి కాసేపు బయటపడటానికి ఇష్టపడుతోంది. ఫాంటసీ, మిస్టరీ కథలు ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్, వింత శక్తులు, నిధి అన్వేషణ వంటి కాన్సెప్టులు థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్‌ను అందిస్తున్నాయి. ఇక అందుకే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇలాంటి సినిమాలను చూడటానికే ప్రేక్షకులు ఎగబడుతున్నారు.
కొత్త జనరేషన్ మన పురాణాలు, ఇతిహాసాల వెనుక ఉన్న సైన్స్ మరియు రహస్యాలను తెలుసుకోవడానికి చాలా కుతూహలం చూపిస్తోంది. ఇక మన ప్రాచీన సంస్కృతిలో దాగున్న గుప్తనిధులు, శపించబడిన దేవాలయాలు, నాగలోకం వంటి మిస్టరీ అంశాలకు నేటి సాంకేతికత జోడించి వెండితెరపై చూపిస్తుంటే యువత బాగా కనెక్ట్ అవుతోంది.
ఫాంటసీ, మైథాలజీ కథలకు భాషతో సంబంధం ఉండదు. 'నాగబంధం' సినిమాను కూడా కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ,తమిళం, కేరళ ఇలా సౌత్ మొత్తం మరియు నార్త్ ఇండియాలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇక కథలో ఉండే యూనివర్సల్ పాయింట్ వల్ల ఈ జోనర్ సినిమాలు దేశవ్యాప్తంగా అందరికీ సులువుగా కనెక్ట్ అయిపోయి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
రొటీన్ ఫార్ములా కథల కంటే భిన్నంగా, మన మూలాలను వెతుక్కుంటూ వెళ్లే ఫాంటసీ సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఇక జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'నాగబంధం' కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసి, కొత్త జనరేషన్‌కు మరింత ఫాంటసీ కిక్ ఇస్తుందని ఆశిద్దాం..
