Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీని మనమే బ్యాడ్ చేసుకుంటున్నామా?

రేట్లు పెరిగితే ప్రేక్షకులపై భారం పడుతుందనేది నిజమే. అదే సమయంలో భారీ ఖర్చుతో సినిమా తీసిన నిర్మాతలు కూడా తమ డబ్బులు తిరిగి రావాలని కోరుకుంటారు.

By:  M Prashanth   |   17 Oct 2026 4:09 PM IST
ఇండస్ట్రీని మనమే బ్యాడ్ చేసుకుంటున్నామా?
X

సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు. నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ టాలీవుడ్‌ లో సినిమా రిలీజైన ప్రతిసారీ టికెట్ రేట్ల, థియేటర్ల కేటాయింపులు, వేరే లాంగ్వేజ్ మూవీస్ గురించి డిస్కషన్స్ మొదలవుతున్నాయి. ఆ డిబేట్స్ వల్ల ఇండస్ట్రీకి ఏమైన ప్లస్ అవుతుందా లేక మన సినిమాలపై మనమే బ్యాడ్ ఇంప్రెషన్ అభిప్రాయం కలిగిస్తున్నామా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఆ డిబేట్ ను స్టార్ట్ చేశాయి. జైలర్ 2 తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దక్కించుకున్న ఆయన.. సినీ ఇండస్ట్రీలో పెరుగుతున్న నెగెటివిటీపై స్పందించారు. ప్రతి విషయాన్ని వివాదంగా మార్చడం వల్ల మన ఇండస్ట్రీకే నష్టం జరుగుతుందన్నది ఆయన మాటల్లో కనిపిస్తోంది. బడా సినిమా విడుదలవుతుందంటే చాలు.. టికెట్ ధరలు పెరుగుతాయనే చర్చ మొదలవుతోంది.

రేట్లు పెరిగితే ప్రేక్షకులపై భారం పడుతుందనేది నిజమే. అదే సమయంలో భారీ ఖర్చుతో సినిమా తీసిన నిర్మాతలు కూడా తమ డబ్బులు తిరిగి రావాలని కోరుకుంటారు. ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే టికెట్ రేట్ల విషయంలో ప్రేక్షకులకు క్లియర్ ఇన్ఫో ఇవ్వడం చాలా ముఖ్యం. ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, వారే తప్పు చేస్తున్నారని అనుకోవడం కూడా సరికాదు.

టికెట్ ధరలు పెంచుతున్నారంటూ కొందరు కావాలనే నెగెటివిటీ పెంచుతున్నారని నాగవంశీ అన్నారు. కానీ ఆ విషయంలో ప్రేక్షకుల ఆందోళనలను కూడా ఇండస్ట్రీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మూవీ చూడటానికి డబ్బులు ఖర్చు చేసేది ప్రేక్షకులే. బెంగళూరులో కొన్ని సినిమాలకు టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని నాగవంశీ చెప్పారు. అక్కడి రేట్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు తక్కువ ధరకే దొరుకుతున్నాయని అభిప్రాయపడ్డారు.

అయితే ఇతర రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం కంటే.. మన దగ్గర ప్రేక్షకులకు ఎంత తక్కువ ధరకు సినిమా చూపించగలమనే దానిపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఇక ఇతర భాషల సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదనే చర్చ కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. ఫెస్టివల్స్ సమయంలో తెలుగు మూవీస్ కు ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారు. తమిళనాడులోనూ పెద్ద తమిళ సినిమాలు వచ్చినప్పుడు వాటికే ఎక్కువ థియేటర్లు దక్కుతాయి.

ఇలాంటి పరిస్థితులు రెండు రాష్ట్రాల్లోనూ ఉంటాయని నాగవంశీ వివరించారు. దీన్ని ఒక ఇండస్ట్రీల మరో పరిశ్రమను అడ్డుకుంటోందనేలా చూడటం సరికాదన్నది ఆయన అభిప్రాయం. అయితే సినీ ఇండస్ట్రీలో పోటీ ఉండటం సహజం. కానీ ప్రతి విషయంపైనా గొడవలు, విమర్శలు పెరిగితే అసలు సినిమాల గురించి చర్చ పక్కకు వెళ్లిపోతుంది. ఒక సినిమా రిజల్ట్ కంటే దాని చుట్టూ ఉన్న వివాదాలే ఎక్కువగా కనిపిస్తాయి.

అయితే విమర్శలు వచ్చిన ప్రతిసారీ వాటిని నెగెటివిటీగా చూడలేం. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా, సినిమా నచ్చకపోయినా ప్రేక్షకులు అభిప్రాయాలను చెబుతారు. వాటిని అర్థం చేసుకుని చేంజెస్ చేసుకోవడం ఇండస్ట్రీ బాధ్యతే. అందుకే మంచి అభిప్రాయం రావాలంటే ముందు ఇండస్ట్రీ వాళ్లే సరైన స్టెప్స్ వేయాలి. అప్పుడే టాలీవుడ్‌ కు ప్లస్ అవుతుందని చెప్పాలి.