తమిళ హీరోలతో నాగవంశీ డబుల్ గేమ్
టాలీవుడ్ లో ఒకప్పుడు తెలుగు హీరోలతోనే సినిమాలు చేసిన నిర్మాతలు.. ఇప్పుడు వేరే లాంగ్వేజ్ స్టార్లపై కూడా ఫోకస్ పెడుతున్నారు.
By: M Prashanth | 25 Sept 2026 5:00 PM ISTటాలీవుడ్ లో ఒకప్పుడు తెలుగు హీరోలతోనే సినిమాలు చేసిన నిర్మాతలు.. ఇప్పుడు వేరే లాంగ్వేజ్ స్టార్లపై కూడా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ తమిళ హీరోలతో వరుసగా సినిమాలను లైన్ లో పెడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధనుష్, కార్తీ, శింబు వంటి హీరోలతో ప్రాజెక్టులు ప్లాన్ చేయడం వెనుక అసలు ప్లాన్ ఏంటోనని ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
నాగవంశీ-ధనుష్ కాంబినేషన్ ఇప్పటికే సార్ సినిమాతో మంచి రిజల్ట్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఆ సినిమా ఎడ్యుకేషన్ సెక్టార్ బ్యాక్ డ్రాప్ లో సాగింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ధనుష్ తో మరో సినిమాను మొదలుపెట్టారు నాగవంశీ. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ కొత్త మూవీ మదురైలో లేటెస్ట్ గా స్టార్ట్ చేయింది. అందులో ఎస్ జే సూర్య, వడివేలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సార్ మూవీ లాగే రెండు భాషల్లోనూ మూవీ రిలీజ్ చేస్తారట.
ఇక్కడే నాగవంశీ ప్లాన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఒక తమిళ స్టార్ హీరోను తీసుకుని కేవలం కోలీవుడ్ ఆడియన్స్ కోసమే సినిమా చేయడం కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే స్టోరీని ఎంచుకుంటున్నారు. అంటే హీరో తమిళ వాడైనా.. సినిమా మార్కెట్ మాత్రం రెండు రాష్ట్రాలకే పరిమితం కాకుండా పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ తో మూడో సినిమా గురించి కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో కార్తీతోనూ నాగవంశీ బ్యానర్ లో సినిమా తెరకెక్కుతోంది. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. మరోవైపు శింబుతో కూడా కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో తమిళ హీరోల విషయంలో సితార బ్యానర్ ఒక్క సినిమాకే ఆగకుండా వరుసగా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇది నిర్మాతకు మరో విధంగా కూడా యూజ్ అవుతుంది. ఒకే సినిమా ద్వారా రెండు పెద్ద మార్కెట్లలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తమిళ హీరోకు అక్కడ ఉన్న మార్కెట్.. తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ కు ఇక్కడ ఉన్న మార్కెట్.. రెండూ కలిస్తే సినిమా రేంజ్ పెరుగుతుంది. అదే సమయంలో స్టోరీ అన్ని వర్గాల ఆడియన్స్ కు అర్థమయ్యేలా ఉంటే లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఈజీగా తగ్గుతుంది.
అందుకే నాగవంశీ ప్రస్తుతం స్టార్ హీరోలు కంటే.. వాళ్ల మార్కెట్ తో తెలుగు సినిమా మేకింగ్ ను మిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ధనుష్ తో మొదలైన జర్నీ ఇప్పుడు సూర్య, కార్తీ, శింబు వంటి హీరోల వరకు వెళ్లింది. ఫ్యూచర్ లో కూడా అలాంటి కాంబినేషన్లు వస్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్ అప్ కమింగ్ సినిమాలు తెలుగు తమిళ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారుతాయి. మరి వరుసగా కోలీవుడ్ హీరోలను లైన్ లో పెడుతున్న ప్రొడ్యూసర్ నాగవంశీకి ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.
