శ్రీలీలతో గొడవల వల్లే ఆ నిర్మాత దూరం..!
తెలుగులో అవకాశాలు తగ్గుతున్న శ్రీలీలకు తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన కెరీర్, కథల ఎంపికపై ఆమె మాట్లాడారు. ఇదే వేడుకలో నిర్మాత నాగవంశీ తనకు, శ్రీలీలకు మధ్య గొడవలు ఎక్కువయ్యాయని సరదాగా వ్యాఖ్యానించారు. తన సినిమాల్లో ఆమెకు అవకాశాలు తగ్గడానికి ఇదే కారణమన్నట్లుగా మాట్లాడటంతో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 17 Nov 2026 11:35 AM ISTటాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా కనిపించిన హీరోయిన్ శ్రీలీల. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. అయితే ఈ మధ్య.. ఈ హీరోయిన్ కి తెలుగులో సినిమాలో అవకాశాలు తాగుతుండగా..తమిళంలో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతునాయి.
శ్రీలీల హైదరాబాద్‌లో జరిగిన ఓం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ కార్యక్రమంలో ఆమె తన సినీ ప్రయాణం గురించి మాట్లాడింది. కెరీర్ ప్రారంభంలో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించానని చెప్పింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయని..వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేశానని వివరించింది.
అయితే కొంత సమయం తీసుకుని తన కెరీర్ గురించి ఆలోచించిన తర్వాత కొన్ని విషయాలు అర్థమయ్యాయని శ్రీలీల తెలిపింది. ఏ సినిమా చేయాలి, ఎలాంటి కథను ఎంచుకోవాలి అనే నిర్ణయాలు మనమే తీసుకోవాలని చెప్పింది.
మరోవైపు ఇదే వేడుకలో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. శ్రీలీల గురించి మాట్లాడుతూ తనకు, ఆమెకు మధ్య గొడవలు ఎక్కువయ్యాయని సరదాగా వ్యాఖ్యానించారు. అందుకే తన సినిమాల్లో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయనే అర్థం వచ్చేలా మాట్లాడారు. సాయి అభ్యంకర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ తనకు బాగా నచ్చిందని నాగవంశీ చెప్పారు. ముఖ్యంగా మేకప్ లేకుండా శ్రీలీల కనిపించిన తీరు చాలా బాగుందని వెల్లడించారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన కింగ్డమ్, లెనిన్ సినిమాలకు మొదట శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టుల్లో ఇతర హీరోయిన్లు కనిపించారు. ఇప్పుడు నాగవంశీ చేసిన వ్యాఖ్యలతో ఈ విషయాలు మరోసారి ఆసక్తిని పెంచాయి.
