ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న నాగవంశీ..!
ఇందులో నాగ వంశీ ఒకరు. నాగ వంశీ సినిమా ఈవెంట్ అంటే హీరో, హీరోయిన్, దర్శకుడు మాట్లాడే మాటలతో పాటు నిర్మాత నాగవంశీ స్పీచ్ కోసం కూడా చాలామంది ఎదురుచూస్తుంటారు.
By: Priya Chowdhary Nuthalapti | 28 Oct 2026 3:23 PM ISTసాధారణంగా సినిమా ఈవెంట్ అంటే హీరో లేదా హీరోయిన్ల స్పీచ్ల కోసమే అందరూ ఎదురు చూస్తారు.. కానీ కొన్నిసార్లు మాత్రం కొంతమంది దర్శకులు, నిర్మాతలు కూడా తమదైన స్పీచ్ లతో అందరినీ ఆకట్టుకుంటూ.. తమ స్పీచ్ ల కోసం ప్రేక్షకులు ఎక్కువ ఎదురు చేసేలా చేస్తూ ఉంటారు.
ఇందులో నాగ వంశీ ఒకరు. నాగ వంశీ సినిమా ఈవెంట్ అంటే హీరో, హీరోయిన్, దర్శకుడు మాట్లాడే మాటలతో పాటు నిర్మాత నాగవంశీ స్పీచ్ కోసం కూడా చాలామంది ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఆయన మాట్లాడే మాటలు, ఇచ్చే ఎలివేషన్లు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా విషయంలో మాత్రం నాగవంశీ పెద్దగా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది.
వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో నాగవంశీ తనదైన శైలిలో మాట్లాడుతూ సినిమాపై హైప్ పెంచుతుంటారు. ముఖ్యంగా త్రివిక్రం అంటే నాగవంశీకి సొంతం ఇంట్లో మనిషి లాంటివాడు. కాబట్టి ఆయన సినిమాలో నాగవంశీ ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు అని అందరూ అనుకోవడం సహజం. కానీ ఈసారి మాత్రం ఆయన నుంచి ఆశించిన స్థాయిలో స్పీచ్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నాగవంశీ స్పీచ్‌లకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన కొన్ని సినిమాల గురించి మాట్లాడే విధానం, ఇచ్చే బిల్డప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే సమయంలో ఆయన వ్యాఖ్యలు కొన్నిసార్లు ట్రోలింగ్‌కు కూడా కారణమవుతుంటాయి. కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఆయన గతంలో చెప్పిన మాటలను గుర్తుచేస్తూ నెటిజన్లు కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆదర్శ కుటుంబం సినిమా ఈవెంట్‌లో నాగవంశీ మౌనంగా ఉండటానికి కారణం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఎక్కువగా మాట్లాడకుండా, ఫలితం వచ్చిన తర్వాత స్పందించాలని ఆయన అనుకుంటున్నారా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ సినిమా మంచి విజయం సాధిస్తే, అప్పుడు నాగవంశీ తనదైన శైలిలో మాట్లాడే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
