Begin typing your search above and press return to search.

"తప్పు వాళ్లది.. దొరికింది మనం": 'వార్ 2' రిజల్ట్ పై నాగవంశీ ఓపెన్ కామెంట్స్!

అయితే, ఆ అంచనాలు తలకిందులయ్యాయి. 'వార్ 2' చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలై, మిశ్రమ స్పందనతో యావరేజ్‌గా నిలిచింది.

By:  M Prashanth   |   21 Oct 2025 7:30 PM IST
తప్పు వాళ్లది.. దొరికింది మనం: వార్ 2 రిజల్ట్ పై నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
X

డబ్బులు పెట్టె నిర్మాతకు ​సినిమా అంటే ఒక రిస్కీ బిజినెస్ లాంటిది. కొన్నిసార్లు చిన్న సినిమాలు కోట్లు కొల్లగొడితే, మరికొన్నిసార్లు భారీ అంచనాలతో వచ్చిన పెద్ద సినిమాలు బోల్తా కొడతాయి. డిస్ట్రిబ్యూటర్లకు లాభనష్టాలు సర్వసాధారణం. అయితే, కొన్ని సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేకపోయినప్పుడు, ఆ భారం మొత్తం డిస్ట్రిబ్యూటర్లపై పడుతుంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.

​యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే నాగవంశీకి ప్రత్యేకమైన అభిమానం. ఆ ఇష్టంతోనే గతంలో 'దేవర' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. అదే అభిమానంతో, ఎన్టీఆర్-హృతిక్ రోషన్ లాంటి క్రేజీ కాంబోలో వచ్చిన 'వార్ 2' తెలుగు హక్కులను కూడా ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

​అయితే, ఆ అంచనాలు తలకిందులయ్యాయి. 'వార్ 2' చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలై, మిశ్రమ స్పందనతో యావరేజ్‌గా నిలిచింది. దీంతో, డిస్ట్రిబ్యూటర్‌గా నాగవంశీపై సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో అనేక రకాల అభిప్రయాలు వచ్చాయి. అందుకు ప్రధాన కారణం నాగవంశీ వార్ 2 తెలుగు ఈవెంట్ లో ఒక బలమైన సవాల్ విసిరారు. ఈ సినిమా చూసి సంతృప్తి చెందకపోతే మళ్ళీ మైక్ పట్టుకొని మిమ్మల్ని సినిమా చూడమని అని నేను అడగాను అంటూ స్ట్రాంగ్ గా మాట్లాడారు. ఇక తీరా రిలీజ్ అయ్యాక రిజల్ట్ తేడా కొట్టడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.

ఈ నేపథ్యంలో, లేటెస్ట్ గా మాస్ జాతర సినిమా ప్రమోషన్ లో మాస్ మహారాజా రవితేజతో చేసిన ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ విషయంపై స్పందించారు. ​"తప్పులు అందరూ చేస్తారు కదా! తప్పు జరిగింది, ఏం చేస్తాం ఇప్పుడు?" అంటూ నాగవంశీ తన వాదనను మొదలుపెట్టారు. "నేనైనా, ఎన్టీఆర్ గారైనా.. ఆదిత్య చోప్రా అనే ఒక పెద్ద మనిషిని, యష్ రాజ్ ఫిల్మ్స్‌ను నమ్మాం. వాళ్ల సైడ్ తప్పు జరిగింది, మనం దొరికాం అంతే. దానికి నన్ను ఏసుకున్నారు (విమర్శించారు)" అని ఆయన ఓపెన్‌గా మాట్లాడారు.

​ఈ ఫెయిల్యూర్‌కు బాధ్యత తమది కాదని, ఒరిజినల్ మేకర్స్ (YRF)దే అని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. తాము కేవలం ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ను నమ్మి సినిమాను తీసుకున్నామని, కంటెంట్ విషయంలో తమ ప్రమేయం లేదని ఆయన అన్నారు. అయితే, ఈ ఫెయిల్యూర్ తన సొంత సినిమాతో రాలేదనే ఒక చిన్న రిలీఫ్ కూడా ఆయన మాటల్లో కనిపించింది. "మనం తీసిన సినిమా కాకుండా బయట సినిమాతో దొరికాం, హ్యాపీ!" అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ​మొత్తం మీద, నాగవంశీ 'వార్ 2' ఫలితంపై తన స్టాండ్‌ను క్లియర్‌గా చెప్పారు. డిస్ట్రిబ్యూటర్‌గా రిస్క్ తీసుకున్నానని, కానీ కంటెంట్ ఫెయిల్యూర్‌కు కారణం తాము కాదని ఆయన వివరణ ఇచ్చారు.