ఫ్లాప్ వస్తే నాలుగైదు రోజులు పిచ్చెక్కిపోతా!
తాను ఫెయిల్యూర్‌ను చాలా పర్సనల్ గా తీసుకుంటానని, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఫ్లాప్ ఫ్లాపే అని ఆయన చెప్పడం నిర్మాతల మనస్తత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 8 Aug 2026 11:27 PM ISTటాలీవుడ్ నిర్మాత నాగవంశీ తాజా కామెంట్స్ టాలీవుడ్ లో నిర్మాతల జీవితంలోని ఒక అరుదుగా చర్చకు వచ్చే కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. సాధారణంగా సినిమా గురించి ఆడియన్స్ కు కనిపించేది ప్రీ రిలీజ్ ఈవెంట్లు, కలెక్షన్ పోస్టర్లు, సక్సెస్ మీట్లు మాత్రమే. కానీ ఒక సినిమా బాక్సాఫీస్ హిట్ కావడానికి ముందు నిర్మాతలు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి గురించి చాలా తక్కువగా మాట్లాడుతారు. నాగవంశీ చెప్పిన మాటల్లో అదే కనిపించింది.
తాను ఫెయిల్యూర్‌ను చాలా పర్సనల్ గా తీసుకుంటానని, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఫ్లాప్ ఫ్లాపే అని ఆయన చెప్పడం నిర్మాతల మనస్తత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తోంది. సాధారణంగా ఫ్లాప్ అంటే కేవలం డబ్బు నష్టం అనే కోణంలో మాత్రమే డిస్కషన్ జరుగుతుంది. కానీ నిర్మాతకు అది ఆర్థిక నష్టంతో పాటు మానసిక దెబ్బ కూడా అవుతుందని ఆయన కామెంట్స్ సూచిస్తున్నాయి. తన సినిమా ఏదైనా వస్తుందంటే రిలీజ్ కు నాలుగైదు రోజుల ముందు నుంచే నిద్ర పట్టదని, రిలీజైన తర్వాత రెవెన్యూ సెటిల్ అయ్యే వరకు తిండి, నిద్ర రెండూ ఉండవని ఆయన చెప్పడం బాక్సాఫీస్ వెనుక కనిపించని వాస్తవాన్ని బయటపెట్టింది.
చాలా మంది నిర్మాతలకు ఎలాంటి ప్రెజర్ ఉండదని అనుకుంటారని, కానీ ఆ ఒత్తిడిని బయటకు చూపించుకోలేమని, ఎవరి దగ్గరికీ వెళ్లి చెప్పుకోలేని బాధ ఉటుందని, తమకు బయటకు చెప్పుకోలేని, చూపించుకోలేని స్ట్రెస్ ఉంటుందని ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గంట గంటకీ కలెక్షన్లు, రిపోర్టులు, అడ్వాన్సులు, డిస్ట్రిబ్యూషన్ లెక్కలు, రికవరీ అంచనాలు వంటి అంశాల మధ్య నిర్మాత మానసికంగా ఎంత తీవ్ర ఒత్తిడిలో ఉంటాడో ఈ కామెంట్స్ తెలియజేస్తున్నాయి.
నాగవంశీ కామెంట్స్ లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, సినిమా చిన్నదైనా, ఫెయిల్యూర్ తాలూకా బాధ మారదనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా అయినా, చిన్న సినిమా అయినా, నిర్మాత తన డెసిషన్స్, ఇన్సెస్ట్‌మెంట్, ప్రిస్టేజ్, టీమ్‌పై ఉన్న బాధ్యతలతో ఆ రిజల్ట్ ను మోస్తాడు. అందుకే ఒక ఫ్లాప్‌ను కేవలం కమర్షియల్ ఫ్లాపుగా కాకుండా పర్సనల్ ఫ్లాపుగా కూడా చాలామంది నిర్మాతలు భావిస్తారని ఆయన కామెంట్స్ సూచిస్తున్నాయి.
టాలీవుడ్ లో హీరోల రెమ్యునరేషన్లు, ఓపెనింగ్స్, రికార్డు కలెక్షన్లపై ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో, బాక్సాఫీస్ హిట్ వెనుక నిర్మాతల నిద్రలేని రాత్రులు, బయటకు కనిపించని స్ట్రెస్ వంటి అంశాలను నాగవంశీ బహిరంగంగా ప్రస్తావించడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇది నిర్మాతల మానసిక ఆరోగ్యం, రిస్క్, ఒత్తిడి గురించి మరింత విస్తృతమైన చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
