హిట్టూ, ఫ్లాపుకీ కొత్త నిర్వచనం చెప్పిన సక్సెస్‌ఫుల్ నిర్మాత
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 10:00 PM ISTటాలీవుడ్ సక్సెస్‌ఫుల్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఒక సినిమా రిలీజవుతున్నప్పుడు ఆ సినిమాలోని హీరోకు ఎంత క్రేజ్ ఉంటుందో అలానే నిర్మాత అయిన నాగ వంశీకి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. మీడియా ముందుకొస్తే చాలు ఏవొక కామెంట్స్ చేసి తన సినిమాకు హైప్ పెంచుతూ ఉంటారు వంశీ.
సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ గా ప్రత్యేక గుర్తింపు
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేతగా ఇండస్ట్రీలో వంశీ కంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కోవిడ్ తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ రేటు ఉన్న నిర్మాణ సంస్థ ఏదంటే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానరే. ఆ బ్యానర్ లోని సినిమాలు సక్సెస్ అవడానికి ఆ సినిమాలోని కంటెంట్ తో పాటూ నాగ వంశీ కష్టం కూడా ఎంతో ఉంది. కాగా వంశీ నిర్మాతగా తాజాగా కింగ్‌డమ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.
రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన కింగ్‌డమ్ జులై 31న ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్డ్స్ టాక్ ను తెచ్చుకుంది. మరో వారం రోజులైతే కానీ కింగ్‌డమ్ పరిస్థితేంటనేది అర్థం కాదు. సినిమా రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ ను ఆపకుండా చేస్తున్న విజయ్ దేవరకొండ, నాగవంశీ.. తాజాగా మీడియాలోని పెద్దలతో కలిసి ఓ చిట్ చాట్ నిర్వహించారు.
అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే తెలుస్తోంది
ఆ చిట్ చాట్ లో భాగంగా ఒక సినిమా హిట్టా లేదా ఫ్లాపా అనేది ఎలా డిసైడవుతుందో వెల్లడించారు. జీఎస్టీతో బయ్యర్లు సేఫ్ గా బయటపడితే అది హిట్ అని, జీఎస్టీ బయ్యర్లకు మిగిలితే అది సూపర్ హిట్ సినిమా అని, కమిషన్ కూడా వస్తే అది బ్లాక్ బస్టర్ అని చెప్పారు వంశీ. ఇప్పటికే తమ కింగ్‌డమ్ సినిమా చాలా ఏరియాల్లో సూపర్ హిట్ అయిందని, మలయాళం నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని, కలెక్షన్ల విషయంలో మరో వారం రోజుల్లో క్లారిటీ వస్తుందని, ఆడియన్స్ ఏ సినిమాను చూడాలనుకుంటున్నారనేది అడ్వాన్స్ బుకింగ్స్ చూసే వరకు తెలియదని, ఏ సినిమా హిట్ అవుతుంది? ఏ సినిమా హిట్ అవదనేది ఎవరూ నిర్ణయించలేమని, కొన్ని సినిమాలు రిలీజైన చాలా రోజులకు కలెక్షన్లు పికప్ అవుతాయని వంశీ చెప్పారు.
