Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ను నేను తక్కువ చేసి మాట్లాడానా..

ఇటీవల సినిమా రిలీజ్ కు ముందు మూవీటీమ్ ప్రమోషన్స్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

By:  M Prashanth   |   2 Aug 2025 11:40 PM IST
పవన్ కళ్యాణ్ ను నేను తక్కువ చేసి మాట్లాడానా..
X

విజయ్ దేవరకొండ కింగ్డమ్ థియేటర్లలో సందడి చేస్తోంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాను, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవల సినిమా రిలీజ్ కు ముందు మూవీటీమ్ ప్రమోషన్స్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే మీట్ లో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు పవర్ స్టార్ అభిమానులు హర్ట్ అయ్యారు. అసలేం జరిగిందంటే

కింగ్డమ్ సినిమా రిలీజ్ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో సక్సెస్ మీట్ ఈవెంట్ కు మళ్లీ పవర్ స్టార్ ను మళ్లీ పిలుస్తారా అనే ప్రశ్న నిర్మాత నాగవంశీకి ఎదురైంది. దానికి రిప్లైగా ఆయన పక్కనున్న హీరో విజయ్ దేవరకొండ ను చూపిస్తూ.. మాకు ఈయనే పవన్ కళ్యాణ్ అని అన్నారు. దీంతో ఆయనపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను డీగ్రేడ్ చేసి మాట్లాడాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అయితే ఈ వివాదంపై నాగవంశీ తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను పవన్ కళ్యాణ్‌ ను తక్కువ చేసి చేయడం ఏంటని ఆయనే ఆశ్చర్యపోయారు. సినిమాలకు సంబంధించివ విషయాల్లో కొందరిని రిఫరెన్స్ గా తీసుకుంటామని, ఎవరైనా హండ్ సమ్ గా ఉన్నారని చెప్పేందుకు హృతిక్ రోషన్‌ లా ఉన్నడని కామెంట్ చేస్తామని.. టాలీవుడ్ లో హీరో అంటే పవన్ కళ్యాణ్ అనే అంటారని అన్నాడు. అదేవిధంగా తాను కూడా అదే ఉద్దేశ్యంతో పవన్ ఒక రిఫరెన్స్ అన్నట్లు.. తమకు విజయే, పవన్ కళ్యాణ్ అనే అర్థంలోనే మాట్లాడానని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

అయితే వాస్తవానికి తాను పవన్ కళ్యాణ్‌ కు ఎలివేషన్ ఇచ్చానని, ఇలాంటి కామెంట్‌ ను వివాదస్పదంగా మారిస్తే.. తాను ఏం చేయలేనని నాగవంశీ చెప్పారు. నిజానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కొందరు నాగవంశీ కామెంట్లను పాజిటివ్‌ గానే తీసుకున్నారు. అది ఎలివేషనే కానీ, డీగ్రేడ్ చేయడం కాదని అంటున్నారు. కానీ, మరికొందరు మాత్రం నాగవంశీ కామెంట్లను నెగెటివ్ గా తీసుకున్నారు.