Begin typing your search above and press return to search.

నాగవంశీ, ఆదిత్య మధ్య గొడవ.. దాని కోసమేనట!

ఇటీవల కూడా ఓ సీన్‌ విషయంలో ఇద్దరి మధ్య వాదన జరిగిందని నాగవంశీ తెలిపారు. "నిన్న రాత్రి కూడా గొడవ అయింది.

By:  M Prashanth   |   9 Sept 2026 8:12 PM IST
నాగవంశీ, ఆదిత్య మధ్య గొడవ.. దాని కోసమేనట!
X

సినిమా తెరకెక్కించే సమయంలో దర్శకుడు, నిర్మాత మధ్య చిన్న చిన్న డిస్ట్రబెన్స్ లు రావడం కామనే. అలాగే కొన్ని సీన్ల విషయంలో తాను, దర్శకుడు ఆదిత్య హాసన్‌ కూడా వాదించుకుంటుంటామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. తమ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఎపిక్‌- ఫస్ట్‌ సెమిస్టర్‌ మూవీ ప్రమోషన్స్‌ లో ఆయన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

"'ఆదిత్య.. నీ లైఫ్‌ లో ఉన్న దరిద్రాలన్నీ స్క్రీన్‌ పై చూపించాల్సిన అవసరం లేదు. సినిమా వేరు.. లైఫ్‌ వేరు' ఇదే విషయాన్ని నేను ఎప్పుడూ అతనికి చెబుతుంటా. మాగ్జిమమ్‌ ఎలిమెంట్స్‌ పెట్టుకోమని అంటా. కానీ అన్నీ చూపించాల్సిన అవసరం లేదని చెబుతుంటా" అని నాగవంశీ చెప్పారు. సినిమా కోసం కొన్ని సీన్స్ ఆర్టిఫీషియల్ గా ఉండటంలో తప్పు లేదని ఆయన చెప్పారు. "మహేంద్రసింగ్‌ ధోనీ బయోపిక్‌ ఉంది. అందులో దిశా పటానీ ఎపిసోడ్‌ ఉంటుంది. అది నిజంగా జరిగిందో లేదో తెలియదు. కానీ స్క్రీన్‌ మీద కథకు అవసరమైన కొన్ని సీన్లు ఉండాలి. అలాంటి వాటిని పెట్టుకోవచ్చని ఆదిత్యకు చెబుతుంటా" అని చెప్పారు.

ఇటీవల కూడా ఓ సీన్‌ విషయంలో ఇద్దరి మధ్య వాదన జరిగిందని నాగవంశీ తెలిపారు. "నిన్న రాత్రి కూడా గొడవ అయింది. ఒక లీడ్‌ సీన్‌ లో కన్వర్జేషన్‌ ఉంటుంది. ఆ సమయంలో స్కోర్‌ వచ్చే చోట ఆదిత్య బ్లాంక్‌ వదిలేస్తాడు. అది క్రియేటివ్‌ స్పేస్‌ అని అతని ఆలోచన. కొన్ని హాలీవుడ్‌ సినిమాల్లో కూడా ఇలాగే ఉంటుంది. కానీ బీజీఎం విషయంలో నేను అలా కాదు.. ఇలా ఉండాలని చెబుతుంటా. కొన్ని సీన్ల విషయంలో మా మధ్య ఆర్గ్యుమెంట్స్‌ జరుగుతుంటాయి" అంటూ చెప్పుకొచ్చారు.

దర్శకుడు ఆదిత్య హాసన్‌ గతంలో 90s–ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ వెబ్‌ సిరీస్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సిరీస్‌ విజయంతో ఆయనకు దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. అదే సమయంలో నిర్మాత నాగవంశీ దృష్టిని ఆకర్షించిన ఆదిత్యకు ఎపిక్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ తో సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు.

బేబీ తర్వాత ఆ జోడీ మరోసారి కలిసి కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. సీనియర్‌ నటుడు శివాజీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అబ్దుల్‌ వాహాబ్‌ సంగీతం అందిస్తున్నారు.

లండన్‌ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ సినిమా న్యూ జనరేషన్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల లైఫ్, వారి రిలేషన్స్, ఎదురయ్యే పరిస్థితులు చుట్టూ సినిమా కథ సాగనుంది. ప్రాక్టికల్‌ గా ఆ లవ్ స్టోరీని తెరకెక్కించినట్లు మూవీ టీమ్ చెబుతోంది. ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌ సెప్టెంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.