జాగ్రత్త పడుతున్న వంశీ
టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థగా మారిన సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్ఛితంగా అందులో ఏదో మ్యాటర్ ఉందనే నమ్మకం ఆడియన్స్ కు కలిగింది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Jan 2026 3:26 PM ISTటాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థగా మారిన సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్ఛితంగా అందులో ఏదో మ్యాటర్ ఉందనే నమ్మకం ఆడియన్స్ కు కలిగింది. నిర్మాత నాగ వంశీ ఇప్పటికే పలు విజయాలతో తన సత్తాను చాటుకోగా ఈ బ్యానర్ నుంచి సంక్రాంతికి అనగనగా ఒక రాజు అనే సినిమా రాబోతుంది.
నవీన్ పోలిశెట్టి హీరోగా డైరెక్టర్ మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయగా ఆ ప్రమోషన్స్ లో నిర్మాత నాగవంశీ పాల్గొంటున్నారు.
సినిమా తప్పకుండా హిట్ అవుతుంది
అనగనగా ఒక రాజు సినిమా కచ్ఛితంగా హిట్ అవుతుందని, కానీ పండగ సీజన్ కాబట్టి తమ సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందనేది తనకు తెలియదని, పండగ, థియేటర్ ఆక్యుపెన్సీ, మిగిలిన సినిమాల రిజల్ట్ ను బట్టి మూవీ రేంజ్ ఉంటుందని చెప్పారు. సినిమాలో నవీన్ పోలిశెట్టి కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీతో పాటూ కొన్ని సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయని వంశీ చెప్పుకొచ్చారు.
2025 సెకండాఫ్ పెద్దగా కలిసిరాలేదు
ఎట్టి పరిస్థితుల్లోనూ అనగనగా ఒక రాజు సినిమా సక్సెస్సే అవుతుందని, ఈ సినిమాపై తనకు 200% నమ్మకం ఉందని నాగవంశీ చెప్పారు. గతేడాది సెకండాఫ్ తనకు పెద్దగా కలిసిరాలేదని, తాను మాట్లాడిన మాటలే మిస్ ఫైర్ అయ్యాయని, అందుకే ఇకపై తన సినిమాల్లోని కంటెంటే మాట్లాడాలనుకుంటున్నానని, అందుకే రిలీజ్ కు ముందు ఎక్కువ మాట్లాడనని చెప్పుకొచ్చారు నాగ వంశీ. గతంలో నాగవంశీ తన బ్యానర్ నుంచి రాబోతున్న పలు సినిమాల గురించి ఓవర్ హైప్ ఇచ్చి మాట్లాడగా ఆ సినిమాలు ఫ్లాపయ్యాయి. అందుకే ఇప్పుడు వంశీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
