అక్కకు మాత్రం ఆయనెప్పుడు ఆన్నయ్యే!
తాజాగా అక్కినేని కుటుంబంలో జరిగిన ఓ సంఘటన గురించి ఏఎన్నార్ కుమార్తె నాగ సుశీల రివీల్ చేసిన సందర్భంతో నాగార్జున మనసు ఎంత గొప్పదన్నది అద్దం పడుతుంది.
By: Srikanth Kontham | 20 Aug 2025 2:00 AM ISTతండ్రి బాధ్యతలు తనయులు తీసుకున్నప్పుడే? ఆ కుటుంబం పరిపూర్ణం. నాకెందుకులే నా పిల్లలు ..భార్య అని వెళ్లిపోతే? అదెలా కుటుంబమవుతుంది. విలువలు.. బాధ్యతలు మోసినప్పుడే అసలైన వారసు లెవర న్నది సమసమాజం చాటి చెబుతుంది. తాజాగా అక్కినేని కుటుంబంలో జరిగిన ఓ సంఘటన గురించి ఏఎన్నార్ కుమార్తె నాగ సుశీల రివీల్ చేసిన సందర్భంతో నాగార్జున మనసు ఎంత గొప్పదన్నది అద్దం పడుతుంది.
నాగ సుశీల భర్త సత్య భూషణ్ రావు కాలం చేసేచివరి రోజుల్లో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుని తమ్ముడైనా నాగర్జునను అన్నయ్యను చేసేసింది. సత్య భూషన్ చివరి రోజుల్లో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కనీసం మంచి నీళ్లు కూడా తాగలేకపోతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురై మదన పడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో చినబాబు నాగార్జున నా దగ్గరకు వచ్చి సుశీల నేను సత్య భూషణ్ తో మాట్లాడనా? అన్నాడు. అనంతరం చినబాబు, అమల, అఖిల్ సత్య భూషన్ దగ్గరకొచ్చి బాధపడకు సుశీల, పిల్లలను నేను చూసుకుంటాను.
దేని గురించి ఆందోళన చెందకని ధైర్యం చెప్పాడు. ఆ మాట నాలో ఎంతో ధైర్యాన్ని నింపింది. ఆ సమయంలో ఆ మాట ఎంతో బలాన్ని చ్చింది. సుఖాల్లో ఉన్నప్పుడు కాదు తోడు కావాల్సింది కష్టాల్లో ఉన్నప్పుడని చినబాబు బాగా అర్దం చేసుకుంటా డు. సమస్య ఏదైనా తాను ఉన్నానంటూ ముందు కొస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏలోటు లేకుండా చూసుకుంటాడు.
అలా వయసులో నాగార్జున చిన్నవారైనా అక్కకు భరోసాగా నిలిచి అన్నయ్యగా మారారు. నాగార్జున ఆ మాట చెప్పిన మరుసటి రోజే సత్యభూషణ్ కన్నుమూశారని నాగ సుశీల తెలిపారు. నాగ సుశీల కుమారుడే నటుడు సుశాంత్. 'కాళిదాసు' సినిమాతో సుశాంత్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.
