పెళ్లికి ముందే వేరే కాపురం గురించి డిస్కషన్
టాలీవుడ్ లోని మోస్ట్ హ్యాండ్‌సమ్, టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఒకరు. క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శౌర్య, ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్చుతానంద, ఛలో, ఓ బేబీ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Sept 2025 3:49 PM ISTటాలీవుడ్ లోని మోస్ట్ హ్యాండ్‌సమ్, టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఒకరు. క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శౌర్య, ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్చుతానంద, ఛలో, ఓ బేబీ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. శౌర్య ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లవుతున్నా ఒకటి రెండు సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ హిట్లు అయితే అతని కెరీర్లో లేవనే చెప్పాలి.
కెరీర్లో మూడేళ్లుగా గ్యాప్
అయితే రంగబలి సినిమా తర్వాత నాగశౌర్య నుంచి మరో సినిమా వచ్చింది లేదు. ఆ తర్వాత శౌర్య కెరీర్లో అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం పలు సినిమాలను లైన్ లో పెట్టి ఆ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు నాగశౌర్య. అయితే శౌర్య మూడేళ్ల కిందట 2022లో బెంగుళూరుకు చెందిన అనుషా శెట్టి ని పెళ్లి చేసుకోగా, వారికి గతేడాది ఓ పాప పుట్టిన విషయం తెలిసిందే.
చిన్నప్పుడే కలిసి ఉండనని చెప్పిన శౌర్య
అయితే రీసెంట్ గా నాగశౌర్య గురించి అతని తల్లి ఉషా ముల్పూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నాగశౌర్య పెళ్లయ్యాక తల్లిదండ్రులతో కాకుండా వేరే ఇంట్లో కాపురం పెట్టారని చెప్పారు ఉష. శౌర్య చిన్నప్పుడే, పెళ్లయ్యాక కలిసుండనని చెప్పేవాడని, ఇద్దరు మంచి వాళ్లు ఒకేచోట ఉండకూడదనే నమ్మకం శౌర్యది అని ఉషా తెలిపారు.
దూరంగా ఉంటేనే బంధాలు బలపడతాయి
ఆ నమ్మకంతోనే పెళ్లయ్యాక శౌర్య, అనుష వేరే ఇంట్లో ఉంటున్నారని, అనూష మంచమ్మాయి అని, తనను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకున్నామని, తను కూడా తమని అలానే చూసుకోవడంతో పాటూ తమని మమ్మీ, డాడీ అని పిలుస్తుందని, అనూష శౌర్యకు మంచి జోడీ అని చెప్పిన ఉషా ముల్పూరి, పెళ్లికి ముందే అనూషతో వేరే కాపురం గురించి చర్చించామని, దూరంగా ఉంటేనే బంధాలు బలపడతాయనుకుని బాధనిపించినా దానికే కట్టుబట్టి ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. చిన్నప్పట్నుంచి తన కొడుకులకు ఆస్తమా ఉండటంతో స్కూల్ కి కూడా పంపకుండా ఇంట్లోనే ఉంచి చదివిస్తూ రోజంతా వాళ్లతోనే స్పెండ్ చేసేదాన్నని, అలాంటి వాళ్లు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లడంతో ఇళ్లంతా బోసిపోయినట్టు అనిపిస్తోందని ఎమోషనల్ అయ్యారు ఉష.
అయితే ఉషా ముల్పూరి కేవలం నాగశౌర్య తల్లిగా మాత్రమే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా అందరికీ పరిచయమే. ఇప్పటికే ఐరా క్రియేషన్స్ పేరిట బ్యానర్ ను స్థాపించి అందులో సినిమాలు తీస్తున్న ఉష, రెస్టారెంట్ బిజినెస్ లో కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఇక శౌర్య విషయానికొస్తే త్వరలోనే పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ టాలెంటెడ్ హీరో.
