Begin typing your search above and press return to search.

నాగశౌర్య పర్సనల్ లైఫ్‌పై రూమర్స్.. ఓ క్లారిటీ వచ్చేసిందిగా..

నాగశౌర్య పర్సనల్ లైఫ్ గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం నడుస్తోంది.

By:  M Prashanth   |   9 Sept 2026 3:35 PM IST
నాగశౌర్య పర్సనల్ లైఫ్‌పై రూమర్స్.. ఓ క్లారిటీ వచ్చేసిందిగా..
X

నాగశౌర్య పర్సనల్ లైఫ్ గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం నడుస్తోంది. భార్య అనూష శెట్టితో ఆయనకు మనస్పర్థలు వచ్చాయని, ఇద్దరూ దూరంగా ఉంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటిపై నాగశౌర్య ఎప్పుడూ ప్రత్యేకంగా స్పందించలేదు. ఇప్పుడు మాత్రం ఫ్రాన్స్ నుంచి వచ్చిన కొన్ని ఫొటోలు ఆ ప్రచారానికి దాదాపు సమాధానం చెప్పేశాయి.





నాగశౌర్య, అనూష ప్రస్తుతం ఫ్రాన్స్‌లో వెకేషన్‌లో ఉన్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావడంతో వెంటనే అవి వైరల్ అయ్యాయి. ముఖ్యంగా గతంలో వచ్చిన రూమర్స్ గుర్తు చేసుకుంటూ చాలామంది ఈ ఫొటోలనే షేర్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి ఇలా కనిపించడం వల్లే వాటికి అంత అటెన్షన్ వచ్చింది.





నాగశౌర్య, అనూష 2022లో పెళ్లి చేసుకున్నారు. అనూష ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయట పెట్టలేదు. సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసే అలవాటు కూడా వీళ్లకు లేదు. అందుకే కొంతకాలం ఇద్దరూ కలిసి కనిపించకపోతే అక్కడి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి.





సెలబ్రిటీల విషయంలో ఇలాంటి రూమర్స్ కొత్త కాదు. ఒకే ఫొటో కనిపించకపోయినా, సోషల్ మీడియాలో కలిసి పోస్టులు రాకపోయినా వెంటనే ఏదో జరిగిందనే కథలు మొదలవుతాయి. నాగశౌర్య విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఫ్రాన్స్‌లో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తున్న ఫొటోలు రావడంతో గత ప్రచారం మళ్లీ హైలెట్ అవుతోంది.

నాగశౌర్య ఏదో ప్రత్యేకంగా ఈ రూమర్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి క్లారిటీ చెప్పలేదు. అనూష కూడా ఏ పోస్టుతోనూ స్పందించలేదు. ఇద్దరూ తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఒక వెకేషన్ ఫొటోతోనే గత కొన్ని వారాలుగా వచ్చిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయాయి. నాగశౌర్య ప్రస్తుతం నెక్స్ట్ సినిమాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు.

నాగశౌర్య చివరిగా బాడ్ బాయ్ కార్తిక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఏప్రిల్ 17న విడుదలైన ఈ సినిమాలో మాస్ యాంగిల్ లో కనిపించాడు. ఇప్పుడు చేతిలో ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను త్వరలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.