'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!
ప్రియదర్శి నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ నుంచి దీపావళి స్పెషల్‌గా విడుదలైన ‘బరాత్ బీట్’ పాట ఆకట్టుకుంటోంది. నాగదుర్గ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అలరించగా, ప్రియదర్శి కూడా స్టెప్పులు వేశారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ ఫ్యామిలీ డ్రామాకు వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 11న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
By: M Prashanth | 8 Nov 2026 7:06 PM ISTప్రియదర్శి హీరోగా నటిస్తున్న 'ఇడుపు కాయితం' సినిమా నుంచి మరో పాట వచ్చేసింది. దీపావళి సందర్భంగా 'బరాత్ బీట్' పేరుతో విడుదల చేసిన ఈ సాంగ్ మంచి జోష్‌తో సాగింది. పెళ్లి బరాత్ నేపథ్యంలో రూపొందించిన ఈ పాటలో మాస్ బీట్స్, డ్యాన్స్ స్టెప్పులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్, డ్యాన్స్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఈ పాటలో తన ఎనర్జీతో ఆకట్టుకున్నారు.
నాగదుర్గకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. జానపద పాటలకు ఆమె వేసే స్టెప్పులు, డ్యాన్స్ చేసే విధానానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు 'బరాత్ బీట్'లోనూ అదే తరహా స్టెప్పులతో సందడి చేశారు. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసేందుకు సెట్ అయ్యేలా పాటను రూపొందించారు. నాగదుర్గ అభిమానులకు కూడా ఈ సాంగ్ మంచి ట్రీట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ మూమెంట్స్ పాటలో హైలైట్ అయ్యాయి.
సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ కూడా పాటకు మంచి ఊపు తీసుకొచ్చింది. బరాత్‌లో వినిపించే మాస్ బీట్స్‌తో సాగే ఈ సాంగ్‌కు కలర్‌ఫుల్ విజువల్స్ జోడించారు. నాగదుర్గ శ్రీలత పాత్రలో నటిస్తుండగా, ప్రియదర్శి శ్రీనివాస్‌గా కనిపిస్తున్నారు. ఈ పాటలో ప్రియదర్శి కూడా డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. నార్మల్ గా తన కామెడీ టైమింగ్, నటనతో మెప్పించే ప్రియదర్శి ఈసారి పూర్తి జోష్‌తో డ్యాన్స్ చేశారు.
ఇప్పటికే 'ఇడుపు కాయితం' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పుడు 'బరాత్ బీట్'తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్లను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఫంక్షన్స్, పెళ్లి వేడుకల్లో వినిపించే పాటల తరహాలో ఈ సాంగ్‌ను డిజైన్ చేశారు. నాగదుర్గకు ఉన్న ఫోక్ డ్యాన్స్ ఇమేజ్‌ను కూడా పాటలో బాగా ఉపయోగించుకున్నారు.
వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇడుపు కాయితం' ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తీన్మార్ సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి, జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చ రవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు కీలక పాత్రలలో నటించారు.
బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలతో ప్రమోషన్లు కొనసాగుతుండగా, 'బరాత్ బీట్'ను దీపావళి స్పెషల్‌గా తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ రాబోయే కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
