Begin typing your search above and press return to search.

చైతూ 'వృషకర్మ'.. రిలీజ్ పై క్లారిటీ వచ్చేదెప్పుడు?

యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మిస్టికల్ థ్రిల్లర్ వృషకర్మపై సినీ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

By:  M Prashanth   |   27 May 2026 3:54 PM IST
చైతూ వృషకర్మ.. రిలీజ్ పై క్లారిటీ వచ్చేదెప్పుడు?
X

యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మిస్టికల్ థ్రిల్లర్ వృషకర్మపై సినీ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తండేల్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌ లోకి వచ్చిన చైతూ.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఫ్యాన్స్‌ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచుతోంది. ముఖ్యంగా విరూపాక్ష లాంటి బ్లాక్‌ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ దండు ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో మూవీపై హైప్ మరింత పెరిగింది.

సినిమాలో చైతూకు జోడీగా యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరీ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ తో ఆ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ కు సూపర్ రెస్పాన్స్ రావడం, 20 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కడం సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ ను చూపిస్తోంది.

రీసెంట్ గా మూవీ టీమ్ రాజస్థాన్‌ లో జరిగిన కీలక షెడ్యూల్‌ ను పూర్తి చేసింది. అక్కడి కోటలు, రాజభవనాల మధ్య తెరకెక్కించిన సీన్స్ కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ స్టిల్స్‌ ను విడుదల చేయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిస్టిక్ క్లైమేట్, గ్రాండ్ లొకేషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వినికిడి. ముఖ్యంగా ఆ షెడ్యూల్ కథలో కీలక మలుపులకు సంబంధించినదని టాక్.

అయితే వృషకర్మకు సంబంధించిన మరో ప్రధాన ఆకర్షణ దాని విజువల్ స్కేల్. దర్శకుడు కార్తీక్ దండు ఆ సినిమాను నార్మల్ థ్రిల్లర్‌ గా కాకుండా, మిస్టికల్ ఎలిమెంట్స్‌ తో కూడిన ఇమర్సివ్ వరల్డ్‌ గా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే భారీ స్థాయిలో సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని సమాచారం. హాలీవుడ్ స్టాండర్డ్స్‌ కు తగ్గట్టుగా విజువల్ ఎఫెక్ట్స్ రూపొందిస్తున్నారని మూవీ టీమ్ చెబుతోంది.

అయితే ఇదే ఇప్పుడు రిలీజ్‌ పై డౌట్లకు కారణమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందట. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ భారీ స్థాయిలో ఉండటంతో సినిమాను ముందు అనుకున్నట్లు డిసెంబర్‌ లో విడుదల చేయడం కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. మేకర్స్ మాత్రం త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెబుతున్నారు.

అయితే సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో కారణం విరూపాక్ష తర్వాత కార్తీక్ దండు ఎలాంటి కథతో వస్తారనే ఆసక్తి కూడా. హారర్, మిస్టిక్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ ను ప్రేక్షకులకు కొత్తగా చూపించడంలో ఆయనకు మంచి పేరు రావడంతో వృషకర్మపై సినీ ప్రియుల్లో క్యూరియాసిటీ నెలకొంది. సాంకేతికంగా కూడా చిత్రానికి స్ట్రాంగ్ టీమ్ పనిచేస్తోంది.

సినిమాటోగ్రాఫర్ రాగుల్ డి హెరియన్ విజువల్స్ అందిస్తుండగా, సంగీత దర్శకుడు అజనీష్ బి లోక్‌ నాథ్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర రూపొందిస్తున్న మిస్టిక్ వరల్డ్ సినిమాకు మరో హైలైట్ కానుంది. మొత్తానికి వృషకర్మ నార్మల్ కమర్షియల్ సినిమా కాదని క్లియర్ గా తెలుస్తోంది. చైతూ కెరీర్‌ లో ఇది ఒక డిఫరెంట్ మూవీగా నిలుస్తుందని సమాచారం. ఏదేమైనా రిలీజ్ ఎప్పుడు అవుతుందో చూడాలి.