Begin typing your search above and press return to search.

చైతూ నెక్స్ట్.. గ్లింప్స్ వచ్చేదెప్పుడు?

దీంతో చైతూ నెక్స్ట్ మూవీలపై అందరి ఫోకస్ పడింది. భారీ హైప్ కూడా క్రియేట్ అయింది. ఆ హైప్ కు తగ్గట్టుగానే మిథికల్ థ్రిల్లర్ తో కొత్త ప్రయోగం చేయబోతున్నారు.

By:  M Prashanth   |   25 Feb 2026 10:17 PM IST
చైతూ నెక్స్ట్.. గ్లింప్స్ వచ్చేదెప్పుడు?
X

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దీంతో చైతూ నెక్స్ట్ మూవీలపై అందరి ఫోకస్ పడింది. భారీ హైప్ కూడా క్రియేట్ అయింది. ఆ హైప్ కు తగ్గట్టుగానే మిథికల్ థ్రిల్లర్ తో కొత్త ప్రయోగం చేయబోతున్నారు.




నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృష కర్మ సినిమాలో నటిస్తున్నారు. విరూపాక్ష వంటి సూపర్ హిట్ తర్వాత కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, బిహైండ్ ది సీన్స్ వీడియోలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.

తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. వృష కర్మ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ ను మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్ ద్వారా వృష కర్మ డివోషనల్ వరల్డ్ ను తొలిసారి పరిచయం చేయనున్నామని తెలిపారు. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్‌ లో నాగచైతన్య ఒక చీకటి గుహలో నిలబడి, పైనుంచి పడుతున్న కాంతి కిరణాల్లో కనిపించడం ఆకట్టుకుంటోంది.

ఆయన లుక్ చాలా రా అండ్ రగ్గడ్‌ గా ఉండటంతో పాటు చేతిలో తవ్వే ఆయుధం, నడుముకు క్లైంబింగ్ గేర్ ధరించడం ద్వారా కథలో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉంటాయని క్లియర్ గా తెలుస్తోంది. సినిమాలోని పాత్ర కోసం నాగ చైతన్య ప్రత్యేకంగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారని అర్థమవుతోంది. స్టంట్స్ కూడా స్వయంగా ఆయనే చేస్తున్నారని సమాచారం.

ఇక సినిమాలో నాగ చైతన్యకు జోడీగా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఆమె పురావస్తు శాస్త్రవేత్త పాత్ర దక్షగా కనిపించనున్నారు. కథలో ఆమె రోల్ కు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉండబోతుందని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌ గా నటిస్తుండడం విశేషం. ఆయనతోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే టెక్నికల్‌ గా కూడా సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ అసెట్ గా మారనుందని సమాచారం. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా ఉండబోతున్నాయి. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ గా రూపొందుతున్న ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా బాపినీడు, సుకుమార్ వ్యవహరిస్తున్నారు. మరి వృష కర్మ ఎలా ఉంటుందో.. ఎంతటి హిట్ అవుతుందో వేచి చూడాలి.