తండేల్ ఎఫెక్ట్ : నాగచైతన్య 'వృషకర్మ' సరికొత్త రికార్డ్
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మైథికల్ థ్రిల్లర్ `వృషకర్మ` విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.
By: Sivaji Kontham | 16 July 2026 10:38 AM ISTఅక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మైథికల్ థ్రిల్లర్ `వృషకర్మ` విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా... నాగచైతన్యను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపిస్తూ ప్రేక్షకులలో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తించింది.
గతంలో నాగచైతన్య అందించిన భారీ బ్లాక్‌బస్టర్ హిట్ `తండేల్` ఇచ్చిన ఊపు.. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న క్రేజ్‌ను మరింత రెట్టింపు చేసింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నాన్-థియేట్రికల్ మార్కెట్ కాస్త మందగించినా `వృషకర్మ` చిత్రం మాత్రం ఆ ట్రెండ్‌ను తిరగరాసింది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ `జీ` గ్రూప్ ఏకంగా 50 కోట్ల రూపాయల భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక ధరకు అమ్ముడైన నాన్-థియేట్రికల్ డీల్‌గా `వృషకర్మ` సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇంతటి భారీ మొత్తానికి బిజినెస్ జరగడం చూస్తుంటే.. ఈ చిత్రం కంటెంట్.. కమర్షియల్ సక్సెస్ రేంజు గురించి అటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు ఎంతటి గట్టి నమ్మకం ఉందో స్పష్టమవుతోంది. `విరూపాక్ష` చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు... క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే సపోర్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం కూడా ఈ భారీ క్రేజ్‌కు ఒక ముఖ్య కారణం.
ప్రీ-రిలీజ్ బిజినెస్‌లోనే భారీ లాభాలను తెచ్చిపెడుతున్న `వృషకర్మ`.. నాగచైతన్య కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ హక్కుల పరంగా కూడా ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో మంచి రేటు పలుకుతోంది. నిర్మాణ విలువలు.. అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా మార్చబోతున్నాయని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.
ప్రస్తుతానికి ఈ సినిమా అధికారిక విడుదల తేదీ ఖరారు కాలేదు. అయితే చిత్రం చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. బ్లాక్ బస్టర్ తండేల్ చిత్రం ఇచ్చిన బూస్ట్ ఇది. చందు మొండేటి తెరకెక్కించిన `తండేల్` నాగచైతన్య బాక్సాఫీస్ స్టామినాను పెంచగా, వృషకర్మ చిత్రం మరో మెట్టు ఎక్కించబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
