అక్కినేని వారసుడికి ఆ ఇద్దరు స్టోరీలు చెప్పారా?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. 'తండేల్' తో 100 కోట్ల క్లబ్ లోకి చేరడంతో? తదుపరి చిత్రాలు ఇప్పటికే లాక్ అయ్యాయి.
By: Srikanth Kontham | 18 Aug 2025 8:45 AM ISTయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. 'తండేల్' తో 100 కోట్ల క్లబ్ లోకి చేరడంతో? తదుపరి చిత్రాలు ఇప్పటికే లాక్ అయ్యాయి. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్నచిత్రమిది. అంచనాలు భారీగా ఉన్నాయి. 'విరూపాక్ష' తర్వాత కార్తీక్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో? అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ సినిమాతోనూ చైతన్య 100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతాడని టీమ్ కాన్పిడెంట్ గా ఉంది.
నయా డైరెక్టర్లు ఇద్దరు:
ఈ ప్రాజెక్ట్ విషయంలో చైతన్య అండ్ కో ఎక్కడా కంగారు పడటం లేదు. హడావుడి చుట్టేయకుండా కూల్ గా పనిచేస్తున్నారు. ది బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడం కోసం టీమ్ నిరంతరం పని చేస్తోంది. ఈసినిమా ఇదే ఏడాది రిలీజ్ కానుంది. 'వృష కర్మ' అనేది టైటిల్ గా వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే శివ నిర్వాణ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. ఇది శివ మార్క్ లవ్ స్టోరీ. ఈ సారి ప్రేమ కథ మరింత హృద్యంగా ఉంటుందని... కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కే చిత్రంగా వినిపిస్తుంది.ఈ రెండు గాక తాజాగా ఇలాకాలెఓ మరో ఇద్దరు దర్శకుల పేర్లు తాజాగా తెరపైకి వస్తున్నాయి.
పాజిటివ్ గానే చైతన్య:
కొరటాల శివ కూడా ఓ సామాజిక అంశాలతో కూడిన కథ వినిపించారుట. స్టోరీ నచ్చడంతో చైతన్య కూడా చేద్దామని చెప్పారట. అలాగే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా చైతన్యను టచ్ లో పెట్టినట్లు సమా చారం. తన మార్క్ యాక్షన్ కంటెంట్ ఉన్న స్టోరీ లైన్ వినిపించాడుట. ఆయనకు కూడా సాను కూలంగానే బధులిచ్చారుట. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ లపై క్లారిటీ రావాలంటే మరింత సమయం పడుతుంది.
ఎవరు ముందు? ఎవరు వెనుక?
ప్రస్తుతం చైతన్య బిజీగా ఉన్నాడు. బోయపాటి కూడా 'అఖండ 2' పనుల్లో నిమగ్నమయ్యారు. కొరటాల మాత్రం ఖాళీగానే ఉన్నారు. ఎన్టీఆర్ తో 'దేవర 2' ప్రాజెక్ట్ డిలే అవ్వడంతో స్టోరీ సిద్దం చేసుకుని రెడీగా ఉన్నా? పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ గ్యాప్ లోనే చైతన్య డేట్లు ఇస్తే సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు నాగచైతన్య డేట్లు ఇవ్వాలంటే? శివ నిర్వాణని హెల్డ్ లో పెట్టాలి లేదా? అతడి ప్రాజెక్ట్ తో పాటు కొరటాల కథని పట్టాలెక్కించాలి.
