Begin typing your search above and press return to search.

అన్నపూర్ణ స్టూడియోస్.. చైతూ టార్గెట్ ఏంటంటే?

టాలీవుడ్‌ లో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోస్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

By:  M Prashanth   |   2 May 2026 11:30 PM IST
అన్నపూర్ణ స్టూడియోస్.. చైతూ టార్గెట్ ఏంటంటే?
X

టాలీవుడ్‌ లో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోస్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఈసారి కారణం సినిమాలు కాదు.. టెక్నాలజీ డెవలప్మెంట్. ముఖ్యంగా యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తీసుకున్న బాధ్యతలు, టార్గెట్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే నటుడిగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న నాగ చైతన్య.. స్టూడియో అభివృద్ధి వైపు కూడా కొంతకాలం క్రితం తన దృష్టి మళ్లించారు.

గత కొన్ని సంవత్సరాలుగా అన్నపూర్ణ స్టూడియోస్‌ లో సాంకేతిక మార్పులు తీసుకురావడంలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది కేవలం పేరుకే కాదు.. నిజంగా స్టూడియో ఫ్యూచర్ ను మార్చే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఆ మార్పులకు ప్రధాన కారణం ఆయన తండ్రి, సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున విజన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. స్టూడియోను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో నాగార్జున ముందుకు వచ్చారు.

అదే దిశలో చైతూ కూడా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో లేటెస్ట్ టెక్నాలజీని తీసుకురావడంపై ఆయన ఫోకస్ పెట్టారు. నిజానికి.. ప్రస్తుతం వరల్డ్ సినీ ఇండస్ట్రీలో సౌండ్, విజువల్ టెక్నాలజీకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, అన్నపూర్ణ స్టూడియోస్‌ లో డాల్బీ ప్రీమియర్ రేంజ్ లెవెల్స్ ను అందించేలా ఫెసిలిటీస్ ను ఏర్పాటు చేయాలన్నది చైతన్య టార్గెట్‌ గా తెలుస్తోంది.

ఇది నార్మల్ అప్ గ్రేడ్ కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్ స్టూడియోలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం. అదే సమయంలో ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన రోల్ యాక్టింగ్ తో మాత్రమే ముగియదని, స్టూడియో అభివృద్ధిలో కూడా బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ కామెంట్స్ చూస్తే.. ఆయన ఎంత సీరియస్‌ గా ప్రాజెక్ట్‌ ను తీసుకున్నారో అర్థమవుతుంది.

సౌండ్ మిక్సింగ్, పోస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ వంటి విషయాల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ను అందుకోవాలంటే భారీ పెట్టుబడులు, సరైన ప్లానింగ్ అవసరం. చైతన్య ఆ రెండు అంశాలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్టూడియోలో కొత్త డిజైన్లు, మోడర్న్ సిస్టమ్‌ లు, మెరుగైన వర్క్‌ ఫ్లోలను అమలు చేయడంపై ఆయన పనిచేస్తున్నారట. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అన్నపూర్ణ స్టూడియోస్‌ ను కేవలం టాలీవుడ్‌ కే కాకుండా ఇతర భాషల సినిమాలకు కూడా అనువైన హబ్‌ గా మార్చాలన్న ఆలోచన ఉంది.

ఇంటర్నేషనల్ ప్రాజెక్టులను ఎట్రాక్ట్ చేసేలా సదుపాయాలు ఏర్పాటు చేస్తే, ఇది ఇండస్ట్రీకి కూడా పెద్ద ప్లస్ అవుతుంది. మొత్తానికి.. నాగచైతన్య కేవలం హీరోగానే కాకుండా, ఒక స్టూడియో ఆర్గనైజర్ గా కూడా తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ను వరల్డ్ రేంజ్ టెక్నాలజీతో తీర్చిదిద్దడమే ఆయన టార్గెట్ గా తెలుస్తోంది. ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం.. చైతూ తీసుకున్న నిర్ణయాలు దాదాపు వర్కౌట్ అవుతాయని అంతా భావిస్తున్నారు.