Begin typing your search above and press return to search.

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచి ఆలపించిన ఈ పాటలో చైతన్య రగ్గడ్ లుక్, ఫిట్‌నెస్, స్టైలిష్ యాక్షన్ ఆకట్టుకుంటున్నాయి. సుకుమార్ రైటింగ్స్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.

By:  M Prashanth   |   7 Nov 2026 7:34 PM IST
నాగచైతన్య వృషకర్మ ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్
X

విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు, ఈసారి నాగచైతన్యతో వృషకర్మ అనే మిస్టీరియస్ అడ్వెంచర్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తూ స్వాగ్ ఆఫ్ అర్జున్ అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ ట్రాక్ ను వదిలారు. నార్మల్ గా చైతూ అనగానే గుర్తొచ్చే క్లాస్ రొమాంటిక్ ఇమేజ్ కి పూర్తి భిన్నంగా, ఈ పాటతో అర్జున్ క్యారెక్టర్ మూడ్ ను పరిచయం చేశారు.




ఈ పాటకు కన్నడ పాపులర్ కంపోజర్ బి. అజనీష్ లోక్‌నాథ్ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు స్వయంగా పాడటం విశేషం. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వింటేనే అసలైన స్వాగ్ తెలుస్తుందంటూ స్టార్టింగ్‌లోనే హింట్ ఇచ్చారు. ఇంగ్లీష్ రాప్ టెక్నో రిథమ్స్, హై వోల్టేజ్ ఎలక్ట్రానిక్ బీట్స్‌తో సాంగ్ ను చాలా వెస్ట్రన్ స్టైల్ లో నడిపించారు. వినగానే క్యాచ్ చేసే రెగ్యులర్ మాస్ బీట్ కాకపోయినా, స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ స్పీడ్ ను తీసుకొచ్చేలా ట్రాక్ కుదిరింది.

లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ లో చైతన్య లుక్ బాగా అట్రాక్ట్ చేస్తోంది. బాడీ ఫిట్‌నెస్ చూస్తే ఈ రోల్ కోసం ఆయన పడ్డ హోమ్‌వర్క్ కనిపిస్తోంది. స్లీవ్‌లెస్ బనియన్, కళ్లజోడుతో వర్క్‌షాప్‌లో మెషిన్లు నడిపించే షాట్స్ లో చైతూ ప్రెజెన్స్ చాలా రఫ్‌గా ఉంది. లవర్‌బాయ్ రోల్స్ నుంచి బయటపడి ఒక సరికొత్త రగ్గడ్ అవతారంలో కనిపించడానికి చేసిన ప్రయత్నం స్క్రీన్ పై ఫ్రెష్ ఫీల్ ఇస్తోంది.

అభినవకవి అందించిన లిరిక్స్ అర్జున్ పాత్రలోని ఆటిట్యూడ్‌ను, లైఫ్ ఫిలాసఫీని ఎలివేట్ చేసేలా సాగాయి. తలరాతను తానే తిరగరాసుకుంటూ ముందుకు సాగే ఒక కాన్ఫిడెంట్ యువకుడి ఆలోచనలను ఇందులో రాశారు. పుట్టుకతోనే స్వాగ్ నాలో అంటూ వచ్చే లైన్స్ యువతకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

వీడియో మధ్యలో చూపించిన బిహైండ్ ది సీన్స్ ఫుటేజ్ సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్‌పై కొన్ని హింట్స్ ఇస్తోంది. చీకటి గుహల్లో తాడు సాయంతో లోపలికి దిగడం, గొడ్డలి పట్టుకుని తిరగడం, వేలాడే వంతెనలపై నడిచే సీన్లు చూస్తుంటే ఏదో పెద్ద రహస్యాన్ని చేధించే అడ్వెంచర్ ట్రాక్ ఉండబోతోందని అర్థమవుతోంది. కార్తీక్ దండు తన ఫస్ట్ మూవీ లాగే ఇందులోనూ బలమైన మిస్టరీ ఎలిమెంట్స్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్వాగ్ ఆఫ్ అర్జున్ ఎలాంటి రొటీన్ ఫార్ములా జోలికి వెళ్లకుండా, అర్జున్ క్యారెక్టర్ ఇంటెన్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి పనికొచ్చిన డీసెంట్ సాంగ్. అజనీష్ మార్క్ టెక్నో బీట్స్ కొత్తగా అనిపించినా, విజువల్స్ తో కలిపి చూస్తేనే పూర్తి ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక డిసెంబర్ 4న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న వృషకర్మ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.