Begin typing your search above and press return to search.

లవ్ స్టోరీస్ చేయాలంటే నాగ చైతన్య ఎందుకు భయపడ్డాడు..?

నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం.. యాక్టర్ గానే కాదు ఆడియన్ గా కూడా లవ్ స్టోరీస్ నే ఇష్టపడతాను. ఐతే కోవిడ్ టైం లో లవ్ స్టోరీస్ ఆడవని భయపెట్టారు.

By:  Ramesh Boddu   |   19 Nov 2025 1:14 PM IST
లవ్ స్టోరీస్ చేయాలంటే నాగ చైతన్య ఎందుకు భయపడ్డాడు..?
X

యువ సామ్రాట్ నాగ చైతన్య లవ్ స్టోరీస్ చేయాలంటే భయపడ్డాడా అదేంటి అసలు చైతన్య అలా భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే.. కోవిడ్ తర్వాత అన్ని యాక్షన్ సినిమాలు.. యూనివర్సల్ మూవీస్ మాత్రమే చూస్తున్నారని లవ్ స్టోరీస్ చూస్తున్నారని అందుకే ఆ టైం లో తాను లవ్ స్టోరీస్ చేయడానికి భయపడ్డానని రీసెంట్ గా చెప్పారు నాగ చైతన్య. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ప్రేమంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లోనే నాగ చైతన్య ఆఫ్టర్ కోవిడ్ అందరు యాక్ష, వరల్డ్ యూనివర్సల్ సినిమాలనే చూస్తున్నారని లవ్ స్టోరీస్ చేయలేదని అన్నారు.

వన్ ఆఫ్ ది మోస్ట్ వర్సటైల్ యాక్టర్..

నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం.. యాక్టర్ గానే కాదు ఆడియన్ గా కూడా లవ్ స్టోరీస్ నే ఇష్టపడతాను. ఐతే కోవిడ్ టైం లో లవ్ స్టోరీస్ ఆడవని భయపెట్టారు. కానీ రీసెంట్ టైమ్స్ లో లవ్ స్టోరెస్ వస్తే ఎలా ఉంటుందో ప్రూవ్ అయ్యిందని అన్నారు నాగ చైతన్య. ఇక ఇదే ఈవెంట్ లో నవనీత్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో వస్తున్నందుకు హ్యాపీగా ఉందని అన్నారు.

ప్రియదర్శి గురించి మాట్లాడుతూ.. వన్ ఆఫ్ ది మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అతను. స్మాల్ బడ్జెట్.. బిగ్ బడ్జెట్.. హారర్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఏదైనా ఓ పక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తూ లీడ్ రోల్స్ తో తన కెరీర్ ని బాగా బిల్డ్ చేసుకుంటున్నాడు. అందుకు ప్రియదర్శిని అప్రిషియేట్ చేయాలని అన్నారు. ఇక ఆనందితో కస్టడీ టైం లో చిన్న రోల్ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నాం.. తమిళ్, తెలుగు రెండిటిలో సినిమాలు చేస్తుందని అన్నారు. ప్రేమంటే సినిమాలో సుమ ఫ్రెష్ సర్ ప్రైజ్.

సుమ ఇంటరాగేషన్ బ్లాస్ట్..

మామూలుగా ఆమె ఈవెంట్స్ లో ఇంటరాగేషన్ ఎలా ఉంటుందో తెలుసు.. అలాంటిది ఒక పోలీస్ రోల్ లో సుమ ఇంటరాగేషన్ బ్లాస్ట్ అవుతుందని అన్నారు నాగ చైతన్య. సినిమాకు లియోన్ జేంస్ మ్యూజిక్ బాగుంది. చిత్రయూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు నాగ చైతన్య.

ఐతే ఈవెంట్ లో నాగ చైతన్య లవ్ స్టోరీస్ చేయడానికి భయపడటం ఏంటని అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అక్కినేని హీరోలకు లవ్ స్టోరీస్ బాగా సూట్ అవుతాయని కామెంట్ చేస్తున్నారు. నాగ చైతన్య కూడా ప్రేమకథలతోనే ప్రేక్షకులకు చేరువయ్యాడని అంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నాగ చైతన్య తండేల్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. అది కూడా ఒక లవ్ స్టోరీనే కాబట్టి నాగ చైతన్య ఎలాంటి డౌట్లు లేకుండా ప్రేమకథలతో సినిమాలు చేయొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.