Begin typing your search above and press return to search.

అతను లేని జీవితం అసంపూర్ణం.. శోభిత ధూళిపాళ్ల

ఇకపోతే ఈ జంట ఈరోజుతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ పెళ్లి వీడియోని శోభిత పంచుకుంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది.

By:  Madhu Reddy   |   4 Dec 2025 2:11 PM IST
అతను లేని జీవితం అసంపూర్ణం.. శోభిత ధూళిపాళ్ల
X

శోభిత ధూళిపాళ్ల.. తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈమె గురించి తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. కానీ ఎప్పుడైతే నాగచైతన్యతో ప్రేమలో పడిందని వార్తలు వెలువడ్డాయో.. అప్పటి నుంచీ శోభిత పేరు టాలీవుడ్లో బాగా మారుమ్రోగిపోయింది. ఇకపోతే అటు నాగచైతన్య.. సమంత నుంచి విడిపోయిన ఏడాది తర్వాత ఈమెతో ప్రేమలో పడ్డారు. పలు సందర్భాలలో కలిసి మీడియా కంటపడడంతో.. ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు రాగా ఎవరూ కూడా దీనిపై స్పందించలేదు. కానీ ఎట్టకేలకు 2024 జూన్ లో సడన్గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ జంట.. 2024 డిసెంబర్ 4న బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహం ముందు అతి తక్కువ మంది సెలబ్రిటీలు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇకపోతే ఈ వివాహానికి సినీ ఇండస్ట్రీ నుండి రామ్ చరణ్, చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, హీరో కార్తీ, రానా, నాని, కీరవాణి తో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాదు ఈ పెళ్లి ఫోటోలను అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్స్ వేదికగా పంచుకుంది. ఇకపోతే ఈ జంట ఈరోజుతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ పెళ్లి వీడియోని శోభిత పంచుకుంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది.

పట్టు వస్త్రాలలో లక్ష్మీనారాయణులులా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు నాగచైతన్య , శోభిత. ఇకపోతే తమ వెడ్డింగ్ వీడియోని శోభిత ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. " ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన తర్వాతే మన జీవితం సంపూర్ణం అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇక నాగచైతన్య నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నా జీవితం పరిపూర్ణమైంది. ఇక ఆయన లేని క్షణాలను నేను ఊహించుకోలేను. ముఖ్యంగా చైతన్య లేని జీవితం అసంపూర్ణం".. అంటూ తన మనసులో భావాలను పంచుకుంది శోభిత. ఇక పెళ్లి తంతులో చేసిన అల్లరి.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు అన్ని విషయాలను ఒక్క వీడియోలో సింపుల్ వర్డ్స్ తో చైతన్యపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగచైతన్య శోభిత జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

శోభిత విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ ఆరంభించిన ఈమె ఆ తర్వాత నటిగా మారింది. 2013లో మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొని రెండవ స్థానాన్ని దక్కించుకున్న శోభిత.. అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీలలో ఇండియా తరఫున పాల్గొనింది. కెరియర్ విషయానికొస్తే 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 లో తొలిసారి నటించింది. ఆ తర్వాత అడవి శేషు హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.