Begin typing your search above and press return to search.

తిరుమలలో సందడి చేసిన నాగచైతన్య - శోభిత దంపతులు.. వీడియో వైరల్!

మరి ఇంతకీ ఆ వీడియోలో శోభితను మెచ్చుకోవడానికి ఏముంది.. ? ఎందుకు శోభితని పొగుడుతున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

By:  Madhu Reddy   |   21 Aug 2025 11:41 AM IST
తిరుమలలో సందడి చేసిన నాగచైతన్య - శోభిత దంపతులు.. వీడియో వైరల్!
X

సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీనటులు పెళ్లయ్యాక పెళ్లి తర్వాత భర్తలతో, భార్యలతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటారు. అలా ఎవరైనా సెలబ్రిటీలు పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న వీడియోలు నెట్టింట వైరల్ అయితే.. ఆ వీడియోలలో కొంతమంది నెగెటివిటీని కొంతమంది పాజిటివిటీని చూస్తారు. అయితే తాజాగా నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ్లతో కలిసి తిరుమలకి వెళ్లిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.ఇక ఈ వీడియోలు చూసిన చాలా మంది నెటిజెన్లు శోభితని మెచ్చుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ వీడియోలో శోభితను మెచ్చుకోవడానికి ఏముంది.. ? ఎందుకు శోభితని పొగుడుతున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నాగచైతన్య - శోభిత దంపతులు..

నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత శోభితతో డేటింగ్ చేసి.. గత ఏడాది డిసెంబర్ లో అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహం ముందు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక వరుస సినిమాల్లో చేస్తూ సక్సెస్ బాటలో ఉన్న నాగచైతన్య తాజాగా టైమ్ తీసుకొని మరీ తన భార్యతో తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. అలా నాగచైతన్య, శోభిత ఇద్దరూ తిరుమలకు వెళ్లిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది.

దంపతులపై నెటిజన్స్ ప్రశంసలు..

ఆ వీడియోలో నాగచైతన్య పట్టు వస్త్రాలు కట్టుకొని సాంప్రదాయంగా కనిపిస్తున్నారు. అలాగే శోభిత కూడా ఎరుపు రంగు చీరలో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపిస్తోంది. పాపిట్లో సింధూరం, నుదుటిన బొట్టు,చేతులకు గాజులు వేసుకొని తెలుగింటి ఆడపిల్లలాగా శోభిత కనిపించడంతో చాలామంది శోభిత సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నాగచైతన్య, శోభిత ఇద్దరు కలిసి సామాన్య భక్తుల లాగే క్యూ లైన్ లో నిల్చొని వెళ్తున్న వీడియో వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు అయినా వీరిలో ఏ కొంచెం అహం కనిపించడం లేదు. సామాన్య భక్తులు లాగే దర్శనానికి వెళ్లారు అంటూ ఈ జంటను చూసి చాలామంది పొగుడుతున్నారు.

నాగచైతన్య సినిమాలు..

నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే.. 'తండేల్' మూవీతో హిట్ కొట్టిన ఈయన నెక్స్ట్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో NC24 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల,పూజ హెగ్డే ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరు ఫిక్స్ అవుతారో తెలియదు. మరొకవైపు దేవర డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా దేవర డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కాదు దేవరా సినిమాను నిర్మించిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య సినిమా చేయబోతున్నారని సమాచారం.

శోభిత సినిమాలు..

శోభిత సినిమాల విషయానికి వస్తే..తమిళ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో వస్తున్న వేట్టవం మూవీలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.అలాగే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో శోభిత ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్నట్టు టాక్