చైతూ లైనప్.. ఆ క్రేజీ కాంబినేషన్ వార్తల్లో నిజమెంత?
రీసెంట్ గా అక్కినేని నాగచైతన్య తదుపరి సినిమాల లైనప్ గురించి కూడా ఇలాంటి టాక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
By: M Prashanth | 14 July 2026 5:00 AM ISTఅఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా, కొన్ని క్రేజీ కాంబినేషన్ల మీద రకరకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. రీసెంట్ గా అక్కినేని నాగచైతన్య తదుపరి సినిమాల లైనప్ గురించి కూడా ఇలాంటి టాక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఏదో ఒక అకౌంట్ లో కాకుండా, పలు ఎంటర్టైన్మెంట్ పేజీలు, సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ లైనప్ గురించి వరుసగా పోస్టులు కనిపిస్తుండటంతో ఇది కాస్తా హాట్ టాపిక్ గా మారిపోయింది.
ప్రస్తుతం వృషకర్మ ప్రాజెక్ట్ షూటింగ్ పనుల్లో ఉన్న చైతన్య నెక్స్ట్ ఒక సీరియస్ హారర్ థ్రిల్లర్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. మసూద సినిమాతో థియేటర్లలో జనాలను భయపెట్టిన డైరెక్టర్ సాయి కిరణ్ తో చైతూ ప్రాజెక్ట్ లాక్ అయిందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఏషియన్ సునీల్ నిర్మాణంలో రాబోయే ఈ కథను చైతన్య ఇప్పటికే పూర్తిగా విన్నాడని, కేవలం ఫైనల్ డెసిషన్ తీసుకుని ఓకే చెప్పడమే బ్యాలెన్స్ ఉందంటూ చాలా వేదికలపై ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది.
ఆ హారర్ సినిమా మ్యాటర్ మాత్రమే కాదు, చైతూ మరో కొత్త డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇంకో వార్త కూడా గట్టిగానే చక్కర్లు కొడుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన బెదురులంక దర్శకుడు క్లాక్స్ తో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని, వృషకర్మ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ ఏడాది చివర్లో అది స్టార్ట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. ఇలా ఒకేసారి ఇద్దరు డిఫరెంట్ డైరెక్టర్ల పేర్లు, అది కూడా కొత్త జోనర్స్ తో బయటకు వచ్చేసరికి న్యాచురల్ గానే ఫ్యాన్స్ లో ఈ ప్రాజెక్ట్స్ మీద ఆసక్తి పెరిగింది.
అయితే ఇంటర్నెట్ లో ఇన్ని రకాలుగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నాగచైతన్య టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. మసూద డైరెక్టర్ సాయి కిరణ్ తో చైతన్య హారర్ మూవీ చేస్తున్నాడనే ప్రచారంలో నిజం లేదట. వాళ్ల మధ్య అలాంటి స్క్రిప్ట్ డిస్కషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఏవీ జరగలేదని ఇన్ సైడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అలానే క్లాక్స్ తో సినిమా అనే మాటలో కూడా ఇంకా అఫిషియల్ క్లారిటీ రాలేదు. నాగచైతన్య వరుసగా అప్ కమింగ్ జనరేషన్ దర్శకులతో అయితే కథలు వింటున్నాడు. కానీ ఇంకా అఫిషియల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు.
కథల విషయంలో చైతన్య ఇప్పుడు పక్కా క్యాలిక్యులేటెడ్ గా అడుగులు వేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నాలుగైదు ప్రాజెక్టులు అనౌన్స్ చేసే ఆలోచనలో అతను అస్సలు లేడు. ముందుగా తన చేతిలో ఉన్న ప్రస్తుత ప్రాజెక్టును పర్ఫెక్ట్ గా ముగించడం మీదే అతని ఫోకస్ అంతా ఉంది. ఆ తర్వాతే తన ఇమేజ్ కి సూట్ అయ్యే కథలను ప్రశాంతంగా వింటూ ఫిల్టర్ చేస్తున్నాడు. అన్ని విధాలా స్క్రిప్ట్ నచ్చితేనే అఫీషియల్ గా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు, ఏ జోనర్ టచ్ చేస్తాడు అనేది పక్కాగా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగక తప్పదు.
