Begin typing your search above and press return to search.

రావు బహాదూర్ పై నాగ చైతన్య బిగ్ స్టేట్‌మెంట్!

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘రావు బహదూర్’ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

By:  Madhu Reddy   |   6 July 2026 10:03 PM IST
రావు బహాదూర్ పై నాగ చైతన్య బిగ్ స్టేట్‌మెంట్!
X

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘రావు బహదూర్’ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాను చూసిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చిత్రబృందాన్ని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ‘రావు బహదూర్’ ఒక కొత్త రిఫరెన్స్ పాయింట్ అవుతుందంటూ చైతు ఇచ్చిన బిగ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

చైతూని కట్టిపడేసిన ఒరిజినల్ సినిమా:

సినిమా చూసిన తర్వాత నాగచైతన్య మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత నేను చూసిన ఒక పక్కా ఒరిజినల్ సినిమా ‘రావు బహదూర్’. ఇలాంటి విభిన్నమైన చిత్రాన్ని స్క్రీన్ మీదకు తీసుకురావాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక నిజంగా ఇలాంటి పవర్‌ఫుల్ పాత్ర దక్కడం ఏ నటుడికైనా ఒక పెద్ద అదృష్టం. ఈ క్యారెక్టర్ మనకు రాలేదేంటా అని ప్రతి నటుడు కొంచెం అసూయపడేలా సత్యదేవ్ తన అద్భుతమైన నటనతో మెప్పించారు" అంటూ సత్యదేవ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

వెంకటేష్ మహా క్రియేట్ చేసిన మాస్టర్‌క్లాస్:

గతంలో మలయాళంలో, కన్నడలో గొప్ప కంటెంట్ రిచ్ సినిమాలు వస్తున్నాయని మనం మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు దర్శకుడు వెంకటేష్ మహా ‘రావు బహదూర్’ రూపంలో తెలుగులో కూడా అలాంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారని చైతు కొనియాడారు. ఇక ఈ సినిమా ఒక మాస్టర్‌క్లాస్ లాంటిదని, ఇందులోని ప్రతి చిన్న డీటైలింగ్ తన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేసిందని చెప్పారు. ఎలాంటి పాత ఫార్ములాలు, లెక్కలు లేకుండా ఈ సినిమాను ప్యూర్ కంటెంట్‌తో తెరకెక్కించారని ప్రశంసించారు.

మహేష్ బాబు సపోర్ట్.. మేకర్స్ ధైర్యం:

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల ‘జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించడం ‘రావు బహదూర్’కి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అయింది. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఎంతో ధైర్యంతో ఈ సినిమాను నిర్మించారని చైతు అభినందించారు. ఇక ఎలాంటి ముందస్తు రిఫరెన్స్ పాయింట్ లేని ఒక కొత్త కథను నమ్మి ప్రేక్షకుల ముందుకు తెచ్చినందుకు నిర్మాతలకు హృదయపూర్వక థాంక్స్ చెప్పారు.

టాలీవుడ్‌కు కొత్త దిక్సూచి:

జూలై 3న విడుదలైన ‘రావు బహదూర్’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకుంటోంది. నాగచైతన్య అన్నట్లుగా, రొటీన్ కమర్షియల్ హంగులకు దూరంగా.. కేవలం కథనే నమ్మి తీసిన ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. భవిష్యత్తులో రాబోయే వైవిధ్యమైన తెలుగు సినిమాలకు ‘రావు బహదూర్’ ఖచ్చితంగా ఒక గొప్ప రిఫరెన్స్ పాయింట్‌గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.