'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచనాలు పెంచేసాడే!
‘మనం’ తరహా కొత్త కథ దొరికితే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని నాగచైతన్య తెలిపారు. ‘వృషకర్మ’ నుంచి ‘ఛలో పదవే’ పాట విడుదల కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అక్కినేని కుటుంబమంతా కలిసి నటించిన ‘మనం’కు సీక్వెల్ చేసేలా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఇంకా కథ సిద్ధం చేయలేదని చైతూ వెల్లడించారు.
By: Sivaji Kontham | 20 Nov 2026 2:43 AM ISTనాగచైతన్య తాజాగా `వృషకర్మ` సినిమా నుంచి `ఛలో పదవే` సాంగ్ లాంచ్ వేడుకలో స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.. `మనం` సినిమాలో అక్కినేని కుటుంబం అంతా నటించింది... మళ్లీ విక్రమ్ కే కుమారే సీక్వెల్ కోసం దిగి రావాలేమో!. కానీ అతడు కూడా ఇంకా అలాంటి స్క్రిప్టును తయారు చేయలేదు.
అందుకే ఎవరైనా అలాంటి కొత్త స్క్రిప్టుతో వస్తే తాను సీక్వెల్ సినిమా చేయడానికి సిద్ధమేనని చైతన్య ప్రకటించారు. ప్రస్తుతం మనం దర్శకుడు విక్రమ్ కే కుమార్ అలాంటి స్క్రిప్టును ఇంకా రెడీ చేయలేదు.
వృషకర్మ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో కాలేజ్ విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు చైతూ ఎంతో ఓపికగా.. ఉత్సాహంగా సమాధానాలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా `మనం` తరహా చిత్రంలో నటించే అవకాశం గురించి విద్యార్థులు ప్రశ్నించగా .. అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించిన `మనం` వంటి కొత్త తరహా స్క్రిప్టు వస్తే తప్పకుండా చేస్తానని చైతన్య స్పష్టం చేశారు.
ఈ వేడుకలో విడుదలైన `ఛలో పదవే` పాట విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలలో బ్లాక్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించిన నాగచైతన్య లుక్ కూడా అభిమానులకు, విద్యార్థులకు బాగా నచ్చింది.
`మనం` చిత్రంతో అక్కినేని అభిమానులకు మరపురాని అనుభూతిని అందించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ ప్రస్తుత ప్రాజెక్టులు, కెరీర్ గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరించే విక్రమ్ తదుపరి ప్రాజెక్టులపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఆయన కెరీర్‌లో `మనం` వంటి క్లాసిక్ తర్వాత ఆ స్థాయి మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేసే కొత్త కథ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
`ఛలో పదవే`పాటకు లభిస్తున్న స్పందన, విద్యార్థుల మధ్య చైతూ షేర్ చేసిన విశేషాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. భవిష్యత్తులో అయినా `మనం` తరహా ప్రత్యేకమైన స్క్రిప్టుతో ఎవరు ముందుకొస్తారో.. చైతన్య ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తారో వేచి చూడాలి.
