చైతూ వీడియో.. 'బంగారం' అంటూ ఫ్యాన్స్!
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
By: M Prashanth | 2 Dec 2025 12:36 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. కొన్ని నెలల క్రితం ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దీంతో ఫ్యాన్స్.. చైతూపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిజానికి.. చైతూ ఆ ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్ కు తాను ఇచ్చే వాల్యూపై మాట్లాడారు. ఓ సంబంధాన్ని బ్రేక్ చేయాలంటే తాను ఒకటికి వెయ్యి సార్లు ఆలోచిస్తానని తెలిపారు. ఎందుకంటే తాను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బ్యాడ్ గా ఉంటుందని తనకు మొత్తం తెలుసు అని చెప్పారు.
అయితే తన లైఫ్ లో జరిగినదే.. చాలా మంది జీవితాల్లో కూడా జరిగిందని చెప్పారు. కానీ ఏదో తన జీవితంలో మాత్రమే జరిగిందని అనుకున్నారని, క్రిమినల్ గా చూశారని తెలిపారు. ఆ విషయంలో చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యానని చెప్పినా చైతూ.. ఇద్దరం కలిసి డిసెషన్ తీసుకుని తమ తమ వేస్ లో ముందుకు వెళ్లామని వెల్లడించారు.
కానీ తన విషయం ఒక ఎంటర్టైన్మెంట్ లా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన త్రో బ్యాక్ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో చైతూ ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు. తమ అభిమాన హీరో నిజంగా బంగారమేనని కామెంట్లు పెడుతున్నారు. అప్పట్లో చైతూపై వచ్చిన నిందలు, కామెంట్లను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.
డివోర్స్ తీసుకునే సమయంలో చైతూపై అనవసరంగా నిందలు మోపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. నిజానికి.. నాగచైతన్య కొన్ని నెలల క్రితం హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకున్నారు. కొంతకాలం లవ్ చేసుకున్న వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.
అయితే తనపై అనవసరమైన వచ్చిన నిందలు తీసిపుచ్చేందుకు.. శోభితతో ప్రేమ, పరిచయం విషయంపై అనేకసార్లు మాట్లాడారు. డివోర్స్ తర్వాతనే తాను, శోభిత కలిశామని నాగచైతన్య చెప్పుకొచ్చారు. పరోక్షంగా నిందలు ఖండించారు. ఏదేమైనా చైతన్య ఇప్పుడు అటు పర్సనల్ లైఫ్.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను సమంగా డీల్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఆడియన్స్ ను వివిధ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
