వృషకర్మ: నాగచైతన్య హై వోల్టేజ్ లుక్
మిస్టరీ థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్టుగా, ఈ టైటిల్ సినిమా రేంజ్ ను పెంచేలా ఉంది. ఈ అనౌన్స్‌మెంట్ తో చైతు కెరీర్ లో కొత్త ఛాప్టర్ మొదలైందని చెప్పవచ్చు.
By: M Prashanth | 23 Nov 2025 10:34 AM ISTయువసామ్రాట్ నాగ చైతన్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NC24 సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. చైతు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు వృషకర్మ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ద్వారా రివిల్ చేశారు. సోషల్ మీడియాలో మహేష్ నాగచైతన్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ లుక్ చాలా సాలీడ్ గా ఉందని కొనియాడారు.
మిస్టరీ థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్టుగా, ఈ టైటిల్ సినిమా రేంజ్ ను పెంచేలా ఉంది. ఈ అనౌన్స్‌మెంట్ తో చైతు కెరీర్ లో కొత్త ఛాప్టర్ మొదలైందని చెప్పవచ్చు. వృషకర్మ ఫస్ట్ లుక్‌లో నాగ చైతన్య లుక్ హై వోల్టేజ్ అనేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన చైతు, ఇప్పుడు కండలు తిరిగిన శరీరంతో చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు.
అతని కళ్లలో కనిపించిన కసి, నిర్ణయం చూస్తుంటే.. ఈ పాత్ర కోసం ఎంత హోమ్ వర్క్ చేశారో అర్థమవుతోంది. ఈ లుక్ చైతు కెరీర్ లోనే బెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్ అని చెప్పవచ్చు. దర్శకుడు కార్తీక్ దండు తన టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. మిస్టిక్ కథాంశంను నేటి హై ఆక్టేన్ యాక్షన్ తో మిక్స్ చేసే స్టైల్ కార్తీక్ దండుకు ఉంది. వృషకర్మ టైటిల్ కూడా అదే మిస్టీరియస్ థీమ్‌ను రిఫ్లెక్ట్ చేస్తుంది.
సుకుమార్ రైటింగ్స్ అండతో బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించడం ఈ సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అతని రస్టిక్ టోన్ మ్యూజిక్ ఈ మైథికల్ జానర్‌కు పెద్ద ప్లస్ అవుతుంది.
సినిమా కోసం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత గొప్పగా ఉన్నాయో చూపిస్తున్నాయి. చైతు ఫిజికల్ ట్రైనింగ్, యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ కోసం టీమ్ చాలా కష్టపడుతోంది. ఈ హై ఎనర్జీ ఇంటెన్స్ ఫైట్స్ సినిమాకు బిగ్ హైలైట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి నాగ చైతన్యకు వృషకర్మ ఒక గేమ్ ఛేంజర్ లాంటిదని చెప్పవచ్చు. ఇప్పటికే తండేల్ సినిమాతో మాస్ ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు యాక్షన్ స్టార్ గా మరో లెవెల్ కు వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
