రికార్డ్ ధరకు చైతన్య కొత్త సినిమా రైట్స్.. కెరీర్ లోనే హైయ్యెస్ట్
తండేల్ సినిమాతో యువ సామ్రాట్ నాగ చైతన్య రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాతో చైతూ చాలా రోజుల తర్వాత హిట్ ట్రాక్ ఎక్కారు.
By: M Prashanth | 28 Oct 2025 3:36 PM ISTతండేల్ సినిమాతో యువ సామ్రాట్ నాగ చైతన్య రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాతో చైతూ చాలా రోజుల తర్వాత హిట్ ట్రాక్ ఎక్కారు. దీంతో తండేల్ తర్వాత ఆయన కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎన్ సీ 24 వర్కింగ్ టైటిల్ తో మైథలాజికల్ జానర్ లో తెరకెక్కుతోంది.
అయితే తండేల్ తో చైతన్య మార్కెట్ పెరిగింది. ఇటు భారత్ లోనే కాదు ఓవర్సీస్ లో సైతం రెవెన్యూలో పెరుగుదల కనిపించింది. అది ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా అడ్వెంచర్, ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతుండడంతో ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ ను పారాస్ ఫిల్స్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ సంస్థ తెలుగులో అనేక సినిమాలను సక్సెస్ ఫుల్ గా ఓవర్సీస్ లో రీలీజ్ చేసింది. నార్త్ అమెరికా సహా ఫారిన్ లో భారీ స్థాయిలో విడుదలలు చేసింది. కాగా, చైతన్య కెరీర్ లో ఓవర్సీస్ లో ఈ రేట్ దక్కించుకున్న సినిమా ఇదే కావడం విశేషం. ఆయన కెరీర్ లో మునుపెన్నడూ ఈ రేట్ కు ఏ సినిమా బిజినెస్ చేయలేదు. ఇక ఈ సినిమాకు కూడా మంచి టాక్ వస్తే.. ఓవర్సీస్ లోనూ చైతన్య మార్కెట్ కు ఢోకా ఉండదు. ఇకపై తీసే సినిమాలకు పెరుగుతూ పోతుంది.
ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పుడే రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ చేయడం.. భారీ స్థాయిలో రూపొందనుండడంతో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా శ్రీ వేంకటేశ్వర బ్యానర్, సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 2027లో సినిమా థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.
ఈ డికేడ్ లో అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటిగా మారింది. అటు చైతూ కూడా మరో సినిమా ఒప్పుకోకుండా ఈ ప్రాజెక్ట్ కోసం ఫుల్ డెడికేషన్ తో పని చేస్తున్నారు. ఆయన కెరీర్ లో తొలి ఫాంటసీ, మైథలాజికల్ సినిమా కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
