యంగ్ హీరో సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా?
చైతూ కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పటికే మూవీ 50% షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 23 Oct 2025 9:00 PM ISTగత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగచైతన్యకు తండేల్ సినిమా హిట్ తో చాలా పెద్ద ఊరట లభించింది. తండేల్ మూవీతో చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిథికల్ థ్రిల్లర్ ను చేస్తున్నారు చైతూ. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికే ఆరు నెలలు దాటింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కూడా విరూపాక్ష తరహాలోనే తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్.
50% షూటింగ్ పూర్తి
విరూపాక్షతో డైరెక్టర్ గా అందరినీ మెప్పించిన కార్తీక్ దండు, ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ, ఏ విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. చైతూ కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పటికే మూవీ 50% షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.
NC24 కోసం భారీ గుహ సెట్
ఈ మిస్టిక్ థ్రిల్లర్ కోసం మేకర్స్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ భారీ గుహను సెట్ వేయగా, ప్రస్తుతం అక్కడే ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే నవంబర్ 16 నుంచి హీరో హీరోయిన్లతో పాటూ వైవా హర్ష, జయరాం తో ఆరు రోజుల పాటూ ఆ గుహ సెట్ లోనే షూటింగ్ చేయనున్నారట. దీంతో ఆ స్పెషల్ సెట్ లో షూటింగ్ పూర్తవనున్నట్టు తెలుస్తోంది.
సమ్మర్ రిలీజ్ కు ప్లాన్
ఈ మిథికల్ థ్రిల్లర్ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ తో కలిపి సుకుమార్ నిర్మిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో NC24ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, చైతన్య ఈ జానర్ లో సినిమా చేయడం ఇదే మొదటిసారి. తండేల్ సినిమా తర్వాత కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న చైతూ, ఈ మూవీతో మరో హిట్ అందుకుని, ఆ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
