నాగ చైతన్య కోసం 10 కోట్ల సెట్!
యువ సామ్రాట్ నాగచైతన్య రెట్టించిన ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 10 Aug 2025 12:00 AM ISTయువ సామ్రాట్ నాగచైతన్య రెట్టించిన ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. `తం డేల్` తో 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిన చైతన్య కార్తీక్ దండుతో అంతకు మించిన భారీ సక్సస్ అందు కోవాలని కసితో పని చేస్తున్నాడు. ఇద్దరి కాంబినేషన్ లో ఓ మిస్టికల్ థ్రిల్లర్ భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. సినిమా కోసం ప్రత్యేకమైన సెట్లు ఎన్నో నిర్మించారు. స్టోరీ అంతా భారీ సెట్లను డిమాండ్ చేయడంతో అందుకు తగ్గట్టు సెట్టు నిర్మించి షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
సిటీలో వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణకు అనుగుణంగా పలు సెట్లు ఎన్నో నిర్మించారు. అన్నింటికన్నా? గుహ సెట్ ఇప్పటికే హైలైట్ అవుతుంది. నిధి అన్వేషణలో భాగంగా సాగే సన్నివేశాలు ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాల నుంచి లీకులందాయి. వాటిలో చైతన్య పెర్పార్మెన్స్ వైవిథ్యంగా ఉంటుందని...థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా కోసం మరో భారీ సెట్ నిర్మిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
10 కోట్ల బడ్జెట్ తో రామోజీ ఫిలిం సిటీలో మరో సెట్ నిర్మిస్తున్నారుట. గుహ సెట్ కు కంటున్యూటీ సన్ని వేశాలు కొన్నింటిని ఇందులో చిత్రీకరించనున్నారుట. వాటితో పాటు మరికొన్ని కొత్త సన్నివేశాలు ఇందు లో చిత్రీకరించనున్నారని చిత్ర వర్గాల నుంచి తెలిసింది. నాగచైతన్య సినిమాలకు సంబంధించి ఇన్ని భారీ సెట్ల నిర్మాణం అన్నది ఈ సినిమా కే చోటు చేసుకున్నట్లు కనిపిస్తుంది. గతంలో చాలా సినిమాల్లో సెట్ సన్నివేశాలున్నాయి. కానీ ఈ సినిమా లో సెట్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు.
10 కోట్లతో ఓ సెట్ నిర్మాణం అన్నది చైతన్య కెరీర్ లో ఇదే తొలిసారి. ఈ సినిమాలో చైతన్య లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటికే పోనీ టెయిల్ లుక్ లో ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆఫ్ ది కెమారా లో లీకైన పిక్స్ ద్వారా విషయం అర్దమవుతుంది. సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి పిక్స్ రిలీజ్ చేయలేదు. చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన అనంతరం ప్రచారం పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.
