చైతూకు గూస్ బంప్స్ తెప్పించిన బాలన్.. బిగ్ సక్సెస్ అవుతుందంటూ..
మాలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన పలు సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఫుల్ గా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం వంటి చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ పొందాయి.
By: M Prashanth | 18 Jun 2026 8:00 PM ISTమాలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన పలు సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఫుల్ గా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం వంటి చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ పొందాయి. ఇప్పుడు అదే టీమ్ కు చెందిన మరో మూవీ బాలన్ - ది బాయ్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అందుకు కారణం అక్కినేని హీరో నాగచైతన్య చేసిన కామెంట్సే.
జూన్ 19వ తేదీన విడుదల కానున్న ఆ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ లో చూసిన నాగచైతన్య సినిమా గురించి ఎంతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మూవీ చూసిన తర్వాత కూడా ఆ కథ తన మనసులో నుంచి పోవడం లేదని, ప్రస్తుతం సినిమా గురించి మాట్లాడుతున్నప్పటికీ తనకు గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పారు. మొదట పోస్టర్ చూసినప్పుడు ఇది తల్లీకొడుకుల ఎమోషనల్ స్టోరీగా అనిపించిందని తెలిపారు.
కానీ సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాలకే కథ పూర్తిగా ఊహించని విధంగా వెళ్తుందని చైతూ పేర్కొన్నారు. ట్రైలర్ చూసినప్పుడే సినిమాలోని టెక్స్చర్, స్క్రీన్ ప్లే ప్రత్యేకంగా కనిపించాయని, కానీ అసలు సినిమాలో పెద్ద సర్ప్రైజ్ లు ఉన్నాయని చెప్పారు. ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లినా, సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతారని ఆయన మూవీ టీమ్ తో లైవ్ గ్రూప్ కాల్ లో అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా తల్లీకొడుకుల రిలేషన్ ను దర్శకుడు చూపించిన తీరు, కథలోని ఎమోషన్స్ తనను బాగా ఆకట్టుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికే మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం సినిమాలు తెలుగులో మంచి అభిమానులను సంపాదించుకున్నాయని గుర్తుచేసిన నాగచైతన్య.. ఈ చిత్రం కూడా అదే లిస్ట్ లోకి చేరుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
కథలోని సడెన్ ట్విస్టులు, పాత్రల గ్రే షేడ్స్, స్టోరీ రైటింగ్ ప్రేక్షకులను కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తాయని ఆయన అన్నారు. ఇక బాలన్ చిత్రానికి ఆవేశం ఫేమ్ జితూ మాధవన్ కథ అందించగా, మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం దర్శకత్వం వహించారు. ఆ కాంబినేషన్ నే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మలయాళంలో సక్సెస్ ఫుల్ క్రియేటివ్ టీమ్ మరోసారి కలిసి పనిచేయడం చర్చనీయాంశమైంది.
ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటం మరో విశేషం. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించే విషయంలో అన్నపూర్ణ స్టూడియోస్ కు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో, బాలన్ పై మరింత నమ్మకం పెరిగింది.
ఇప్పటికే నాగచైతన్య నుంచి వచ్చిన ప్రశంసలు, మంజుమ్మెల్ బాయ్స్- ఆవేశం టీమ్ కాంబినేషన్, సస్పెన్స్ తో కూడిన కథ సహా వివిధ ఎలిమెంట్స్ కలిసి సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఆ చిత్రం కూడా మలయాళం నుంచి వచ్చిన మరో సక్సెస్ ఫుల్ కంటెంట్ బేస్డ్ మూవీగా నిలుస్తుందా లేదా అన్నది జూన్ 19వ తేదీన తేలనుంది.
