'కింగ్ 100' లో చైతన్య అతిథి పాత్రలో నటిస్తున్నారా?
నాగచైతన్య నటించిన ‘వృషకర్మ’ ప్రమోషన్లలో ‘కింగ్ 100’ చర్చ ఆసక్తికరంగా మారింది. నాగార్జున సినిమాలో క్యామియో చేస్తున్నారా అని విద్యార్థులు ప్రశ్నించగా చైతూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ‘మనం’లాంటి కథ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. ఈ చర్చతో రెండు సినిమాలపై సోషల్ మీడియాలో ఆసక్తి పెరిగింది.
By: Srikanth Kontham | 20 Nov 2026 10:06 AM ISTఅక్కినేని నాగచైతన్య నటించిన `వృషకర్మ` డిసెంబర్ 4న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా చిత్రబృందం వేగం పెంచింది. తాజాగా ఈ చిత్రంలోని `చలో పదవే` సాంగ్ విడుదలైంది. ఈ పాట ఇప్పటికే అంతర్జాలంలో దూసుకుపోతోంది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నాగచైతన్యపై ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థుల ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తించాయి. నాగార్జున నటిస్తున్న మైలురాయి చిత్రం `కింగ్ 100`లో నాగచైతన్య క్యామియో రోల్ చేస్తున్నారా? అనే ప్రశ్న కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
`చలో పదవే` సాంగ్ లాంచ్ వేదికపై ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలతో పాటు.. సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చలపై నాగచైతన్య ఇచ్చిన సమాధానాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న భారీ ప్రాజెక్టు `కింగ్ 100`లో చైతూ కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈవెంట్‌లో ఈ ప్రశ్న ఎదురైంది. కింగ్ సినిమాలో నటిస్తున్నారా? మనం లాంటి సినిమాను మీ నుంచి మళ్లీ ఊహించవచ్చా? అని విద్యార్థి ప్రశ్నించగా, చైతూ తనదైన శైలిలో స్పందించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మనం లాంటి స్క్రిప్టు వస్తే తప్పకుండా చేస్తామని చైతన్య అన్నారు. అయితే కింగ్ 100లో నటిస్తున్నారా లేదా? అనే విషయంపై అస్సలు క్లూ కూడా ఇవ్వలేదు.
మరోవైపు ఇదే ఈవెంట్‌లో ఒక విద్యార్థి అడిగిన ప్రశ్న.. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ టాపిక్‌గా మారింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగే ఇలాంటి ఓపెన్ ఇంటరాక్షన్లు సినిమాకు ఎంతవరకు ఉపయోగపడతాయి?అనవసర చర్చలకు ఎలా దారితీస్తాయి? అనే కోణంలో సినీ విశ్లేషణలు సాగాయి. అయితే నాగచైతన్య తన సంయమనంతో పరిస్థితిని చక్కదిద్దిన తీరు ఆకట్టుకుందని ప్రశంసలు కురుస్తున్నాయి.
డిసెంబర్ 4న విడుదల కానున్న `వృషకర్మ` ప్రమోషన్లను మరింత వేగవంతం చేస్తున్న ఈ సమయంలో `కింగ్ 100` గురించి ప్రశ్నించడం టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది. అందుకే చైతన్య సైలెంట్ గా ఉన్నారు. అయితే నాగార్జున సినిమాలో చై క్యామియో వార్తలు.. ఈవెంట్‌లోని వైరల్ క్లిప్స్ సినిమాకు అదనపు బజ్‌ను తెచ్చిపెట్టాయి. అధికారిక ప్రకటనలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చలు వృషకర్మ, కింగ్ 100 సినిమాలపైనా హైప్ ని పెంచాయి. నాగచైతన్య వృషకర్మ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
