Begin typing your search above and press return to search.

అల్లరోడి సినిమా.. అక్కినేని హీరో క్లాప్..!

అల్లరి నరేష్ హీరోగా నరేష్ 65వ సినిమా నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

By:  Ramesh Boddu   |   6 Sept 2025 2:08 PM IST
అల్లరోడి సినిమా.. అక్కినేని హీరో క్లాప్..!
X

అల్లరి నరేష్ హీరోగా నరేష్ 65వ సినిమా నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ఈ సినిమాను చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. నరేష్ 65 సినిమా హై లెవెల్ ఫాంటసీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గెస్ట్ గా వచ్చారు.

నరేష్ 65 సినిమా పూజా కార్యక్రమాలు..

నాగ చైతన్య క్లాప్ కొట్టగా మెగా డైరెక్టర్ బాబీ కొల్లి కెమెరా ఆన్ చేశారు. వి.ఐ ఆనంద్ ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. అంతేకాదు నిర్మాతలు అనిల్ సుంకర, జెమిని కిరణ్ కూడా నరేష్ 65 సినిమా పూజా కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. ఒకప్పుడు కామెడీ కింగ్ గా తన సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు అల్లరి నరేష్.

ఈమధ్య ఆయన కొత్త కథలతో పంథా మార్చి సినిమాలు చేస్తునాడు. ఐతే ఆడియన్స్ తన నుంచి ఎంటర్టైన్ కోరుతున్నారని గుర్తించిన నరేష్ ఓ పక్క ప్రయోగాలు చేస్తూనే మరోపక్క ఎంటర్టైన్ మెంట్ బేస్ సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పుడు ఇయర్ కి 3 సినిమాలు చేసి దర్శక నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిన అల్లరోడు మళ్లీ తన రైట్ ట్రాక్ లోకి ఎక్కాడని అనిపిస్తుంది.

అల్కహాల్ టీజర్ తో సర్ ప్రైజ్..

రీసెంట్ గా అల్కహాల్ టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన అల్లరి నరేష్ మళ్లీ మరో సినిమా ముహుర్తం పెట్టడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమా కాబట్టి కంపల్సరీ మంచి ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉంటుందని అనిపిస్తుంది. మరి అల్లరోడు లక్ ఎలా ఉందో చూడాలి.

కమర్షియల్ సినిమాలు ఎన్నొచ్చినా ఆడియన్స్ కి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చే సినిమాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. మరి అలాంటి సినిమాల్లో తన సత్తా చాటుతూ వచ్చిన అల్లరోడు ఈ సినిమాలతో ఎలాంటి కిక్ ఇస్తాడో చూడాలి. అల్లరి నరేష్ ఈమధ్య సీరియస్ కథలు చేయడం వల్ల అతని కామెడీ మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఆడియన్స్ లో వచ్చింది. దాన్ని క్యాచ్ చేసి అతనితో మళ్లీ ఒకప్పటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ క్రమంలోనే చంద్రమోహన్ తో అల్లరోడు తన నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడు. సినిమా ఆరంభాన్నే ఒక జోష్ తో మొదలు పెట్టారు చిత్ర యూనిట్.