'హ్యాపీ బర్త్‌డే లవర్'.. శోభిత రొమాంటిక్ మూమెంట్
శోభిత షేర్ చేసిన ఫోటో చాలా సినిమాటిక్‌గా, క్యూట్‌గా ఉంది. ఇది ఏదో ఫారెన్ వెకేషన్‌లో తీసిన ఫోటోలా కనిపిస్తోంది.
By: M Prashanth | 23 Nov 2025 12:23 PM ISTఅక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, పెళ్లి తర్వాత చైతూ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో ఇది ఆయనకు చాలా స్పెషల్. ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తూ, ఆయన సతీమణి శోభిత ధూళిపాళ సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం విషెస్ చెప్పడమే కాకుండా, వారిద్దరూ కలిసి ఉన్న ఒక అన్‌సీన్ ఫోటోను షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.
శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో చైతూతో ఉన్న ఒక రొమాంటిక్ ఫోటోను షేర్ చేస్తూ.. "హ్యాపీ బర్త్ డే లవర్" అంటూ క్యాప్షన్ పెట్టారు. పెళ్లయిన తర్వాత కూడా భర్తను 'లవర్' అని పిలుస్తూ ఆమె చెప్పిన విషెస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆ ఒక్క ముక్కలోనే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
శోభిత షేర్ చేసిన ఫోటో చాలా సినిమాటిక్‌గా, క్యూట్‌గా ఉంది. ఇది ఏదో ఫారెన్ వెకేషన్‌లో తీసిన ఫోటోలా కనిపిస్తోంది. వర్షం పడిన తడి రోడ్డుపై, రాత్రి వేళ లైట్ల వెలుతురులో ఇద్దరూ నిలబడి ఉన్నారు. చలికి శోభిత కోట్ వేసుకుని ఉండగా, చైతూ ఆమె కోట్‌ను సరిచేస్తూ చాలా కేరింగ్‌గా చూస్తున్నారు.
ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్న ఆ మూమెంట్ వారి బాండింగ్‌ను క్లియర్‌గా చూపిస్తోంది. ఇక పర్సనల్ లైఫ్‌లోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదివరకే వచ్చిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వినాయన్ని అందుకుంది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా వంద కోట్లను కలెక్ట్ చేసింది.
ఇక ప్రస్తుతం ఆయన కార్తిక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' అనే భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. మీనాక్షి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్న చైతూకు, ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మరోవైపు శోభిత కూడా తన సినిమాలతో వెబ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మంచి లవ్ స్టొరీ వస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
