అన్నమయ్య మళ్లీ అక్కినేని హీరోనే..!
అక్కినేని ఫ్యామిలీ హీరోలు వారి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే సినిమాలే కాదు కొన్నిసార్లు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే సినిమాలు కూడా చేస్తారు. ఏఎన్నార్ సినీ వారసత్వాన్ని నాగార్జున సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ వచ్చారు.
By: Ramesh Boddu | 6 Oct 2025 12:57 PM ISTఅక్కినేని ఫ్యామిలీ హీరోలు వారి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే సినిమాలే కాదు కొన్నిసార్లు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే సినిమాలు కూడా చేస్తారు. ఏఎన్నార్ సినీ వారసత్వాన్ని నాగార్జున సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ వచ్చారు. నాగార్జున తర్వాత వారసులు నాగ చైతన్య, అఖిల్ కూడా తెరంగేట్రం చేసి వాళ్ల టేస్ట్ కి తగిన సినిమాలు చేస్తూ వస్తున్నారు. నాగ చైతన్య డిఫరెంట్ సినిమాలు అటెంప్ట్ చేస్తూ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు. ఈ ఇయర్ వచ్చిన తండేల్ తో 100 కోట్ల క్లబ్ లో కూడా చేశాడు నాగ చైతన్య.
నాగ చైతన్య డ్రీం ప్రాజెక్ట్స్ ..
రీసెంట్ గా నాగ చైతన్య ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందుకే తనకు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు చేయాలని ఉందని వెల్లడించాడు. ఏ హీరోకి అయినా ఇలాంటి డ్రీం ప్రాజెక్ట్స్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ తనకు నాన్న చేసిన అన్నమయ్య తరహా సినిమాలు చేయాలని ఉందని అన్నాడు నాగ చైతన్య. అంతేకాదు నిన్నే పెళ్లాడతా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సినిమాలు 100 సార్లు పైగా చూశానని.. ఆ సినిమాలు అంత ఇష్టమని.. ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాలు బోర్ కొట్టవని అన్నాడు నాగ చైతన్య.
తండేల్ తర్వాత విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమా కూడా థ్రిల్లర్ జోనర్ లోనే వస్తుందని తెలుస్తుంది. వృషకర్మ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. చైతన్య కెరీర్ లో ఫస్ట్ టైం థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.
అఖిల్ ఒక సాలిడ్ హిట్..
వృషకర్మ సినిమా షూటింగ్ ఆల్రెడీ జరుగుతుంది. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. అక్కినేని 3వ తరంలో నాగ చైతన్య కెరీర్ ని సెట్ రైట్ చేసుకున్నాడు కానీ అఖిల్ మాత్రం కెరీర్ లో ఒక సాలిడ్ హిట్ కొట్టలేదు. తీసిన నాలుగు సినిమాల్లో ఒకటి జస్ట్ ఓకే అనిపించుకుంది. అందుకే లెనిన్ తో అఖిల్ కూడా కమర్షియల్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు చేయాలంటే అది అక్కినేని హీరోల వల్లే అవుతుంది. అది కూడా నాగార్జున మాత్రమే చేయాలని ప్రూవ్ చేసుకున్నాడు. ఐతే నాగ చైతన్య తర్వాత అలాంటి డివోషనల్ మూవీస్ చైతన్య చేస్తాడా లేదా అన్న డౌట్ ఉండేది. కానీ నాగ చైతన్యకు కూడా అలాంటి ఆలోచన ఉంది కాబట్టి తప్పకుండా ఫ్యూచర్ లో అలాంటి ఒక సినిమా చూసే ఛాన్స్ ఉంది.
