నాగచైతన్య.. న్యూ స్టైల్ లో కిర్రాక్ లుక్
సోఫాలో కూర్చుని సీరియస్ గా పోజిచ్చినా, నిలబడి రాయల్ గా చూస్తున్నా ఆ చార్మ్ అస్సలు తగ్గలేదు. ఈ పిక్స్ లో అతడి కాన్ఫిడెన్స్ అండ్ ప్రెజెన్స్ క్లియర్ గా కనిపిస్తోంది.
By: M Prashanth | 13 Aug 2026 11:37 PM ISTఅక్కినేని నాగచైతన్యకు సంబంధించిన కొత్త ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్లాక్ షర్ట్, దానికి మ్యాచింగ్ వెల్వెట్ జాకెట్ వేసుకుని లైట్ గా పెంచిన గడ్డంతో చైతన్య చాలా క్లాసీగా కనిపిస్తున్నాడు. ఫేస్ లో ఒక రకమైన సీరియస్ నెస్, సింపుల్ స్టైలిష్ అప్పీరియెన్స్ తో ఈ పిక్స్ భలే కుదిరాయి.
సోఫాలో కూర్చుని సీరియస్ గా పోజిచ్చినా, నిలబడి రాయల్ గా చూస్తున్నా ఆ చార్మ్ అస్సలు తగ్గలేదు. ఈ పిక్స్ లో అతడి కాన్ఫిడెన్స్ అండ్ ప్రెజెన్స్ క్లియర్ గా కనిపిస్తోంది. ఫ్యాన్స్ అయితే న్యూ స్టైల్ లో కిర్రాక్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చైతన్య ప్రస్తుతం నటిస్తున్న పెద్ద ప్రాజెక్ట్ వృషకర్మ. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ ప్రాజెక్ట్ తో చేతులు కలిపింది. మైథాలజీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కు అడ్వెంచర్ జోడించి చాలా భారీ స్కేల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ సినిమాకు సంబంధించి వచ్చిన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. నాగచైతన్య సైతం తన కెరీర్ లోనే ఇది చాలా స్పెషల్ ఫిలిం అని గతంలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే దానిపై మేకర్స్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ రిలీజ్ డేట్ రాలేదు. ఇక చైతన్య గతం చిత్రం తండేల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ఆ సినిమా చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా వంద కోట్ల మార్క్ దాటేసి ఆయనకు తొలి వంద కోట్ల సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది.
అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చైతన్య నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో న్యాచురల్ గానే వృషకర్మ మీద అందరి ఫోకస్ పడింది. తండేల్ లో పూర్తి డీ గ్లామర్ విలేజ్ కుర్రాడిగా కనిపించిన చైతూ, ఇప్పుడు ఇలా ఫార్మల్ క్లాసీ బ్లాక్ డ్రెస్ లో కనిపించేసరికి ఈ ఫొటోలకు మరింత అటెన్షన్ దొరికింది. ఒక పక్క సినిమా షూటింగ్ నడుస్తుండగానే ఇలాంటి స్టైలిష్ పిక్స్ బయటకు రావడం ప్రాజెక్ట్ పై బజ్ ను పెంచుతోంది.
